FUNKY Release Date: విశ్వక్ సేన్ 'ఫంకీ' Vs రోషన్ 'ఛాంపియన్' - అడివి శేష్ 'డెకాయిట్' పరిస్థితి ఏంటి?
Vishwak Sen FUNKY: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అదే రోజున రోషన్ ఛాంపియన్ సైతం రిలీజ్ కానుంది.

Vishwak Sen's FUNKY Movie Compete With Roshan Meka Champion: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ దర్శకత్వంలో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ 'FUNKY'. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ నెలకొంది.
'FUNKY' Vs 'ఛాంపియన్'
'FUNKY' మూవీని క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే, అదే రోజున యంగ్ హీరో రోషన్ మేకా 'ఛాంపియన్' సైతం రిలీజ్ కానుంది. దీంతో ఇద్దరు యంగ్ హీరోస్ మధ్య బాక్సాఫీస్ పోటీ నెలకొంటుందనే టాక్ వినిపిస్తోంది. 'ఫంకీ'ని ఒక రోజు ముందు కానీ వెనుక కానీ అటు ఇటుగా రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనిపై టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఈ మూవీలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా... భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక 'ఛాంపియన్' విషయానికొస్తే... ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా... స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుండగా... ఫుట్ బాల్ ప్రధానాంశంగా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా మూవీ తెరకెక్కుతోంది.
Also Read: మాహిష్మతి సామ్రాజ్యం కోసం 'బాహుబలి' వచ్చేశాడు - 'బాహుబలి: ది ఎపిక్' ఫస్ట్ ట్రైలర్ వేరే లెవల్
'డెకాయిట్' వాయిదా!
మరోవైపు, అడివి శేష్ 'డెకాయిట్' మూవీ కూడా డిసెంబర్ 25నే రిలీజ్ చేస్తున్నట్లు ముందుగా ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అనుకున్న డేట్ ప్రకారమే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు టీమ్ శ్రమిస్తుండగా రీసెంట్‌గా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం హీరో అడివి శేష్ గాయపడ్డారు. డాక్టర్ల సూచన మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నందున రిలీజ్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే గ్లింప్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటుండగా... షూటింగ్ షెడ్యూల్‌పై ఎలాంటి అప్డేట్ లేదు.
అడివి శేష్ తిరిగి ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారో అప్పుడే రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చెప్పిన టైంకే రిలీజ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహించగా... అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ ప్రొడ్యూస్ చేస్తున్నారు.





















