Supreme Court : కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చే విషయంలో ఏపీ, బీహార్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

FOLLOW US: 

కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. నిధులను కూడా కేటాయించింది.

అయితే కొన్ని రాష్ట్రాలు చురుగ్గా కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదేశాలు.. దరఖాస్తులతోనే సరి పెట్టాయి. ఇంత వరకూ ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, బీహార్ ఉన్నాయి. పరిహారం ఇవ్వడం లేదని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పరిహారం ఎందుకు చెల్లించలేదో సరైన కారణం చెప్పలేకపోవడంతో జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Also Read: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్

Koo App
కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల పరిహారం గతంలో ప్రకటించారు. #SupremeCourt #Covid19 #APNews #APCovidDeaths #Corona https://telugu.abplive.com/news/the-ap-and-bihar-governments-have-been-negligent-in-providing-compensation-to-the-families-of-corona-victims-the-supreme-court-was-outraged-at-those-governments-18940 - Shankar (@guest_QJG52) 19 Jan 2022

ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్‌ ఎంఆర్‌ షా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అయితే ధరఖాస్తుల సమయంలోనే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఎలా ధరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత లేకుండా పోయింది.

Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?

ఒక్క ఏపీ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉంది. చివరికి సుప్రీంకోర్టు వద్దకు విషయం చేరింది. గతంలో పరిహారం కూడా ప్రభుత్వాలు స్వతహాగా ఇవ్వాలని నిర్ణయించలేదు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే విచారణ జరిపిన తర్వాత కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ. యాభై వేలు ఇవ్వడానికి అంగీకరించింది. విపత్తు నిధులు అందుకోసం ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కానీ రాష్ట్రాలు మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాయి. 

Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Jan 2022 01:40 PM (IST) Tags: supreme court AP government Supreme Court angry over AP-Bihar governments compensation to families of corona victims Bihar government

సంబంధిత కథనాలు

Kondapur Crime : కొండాపూర్ లో దారుణం, యువతిని ఇంట్లో బంధించి నలుగురు యువకులతో అత్యాచారయత్నం!

Kondapur Crime : కొండాపూర్ లో దారుణం, యువతిని ఇంట్లో బంధించి నలుగురు యువకులతో అత్యాచారయత్నం!

Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ

Nepal Missing Aircraft: నేపాల్ లో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యం, రంగంలోకి దిగిన ఆర్మీ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Family Kidnap : అప్పు తీసుకున్నందుకు కుటుంబాన్నే కిడ్నాప్, గ్రామస్తుల ఎంట్రీతో సీన్ రివర్స్!

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

Nellore Govt Hospitals : నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందని సేవలు, అడుగడుగునా సిబ్బంది నిర్లక్ష్యం!

టాప్ స్టోరీస్

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Adivi Sesh: ఆ సీన్లు పెడితే నమ్మేవారు కాదు - 'మేజర్' సినిమాపై అడివి శేష్ వ్యాఖ్యలు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Bank Accounts Benefits: అవునూ.. అసలెన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉంటే బెస్ట్‌! ఇలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయని తెలిస్తే..!

Bank Accounts Benefits: అవునూ.. అసలెన్ని బ్యాంక్‌ అకౌంట్లు ఉంటే బెస్ట్‌! ఇలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయని తెలిస్తే..!

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?