By: ABP Desam | Updated at : 18 Jan 2022 02:17 PM (IST)
ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?
"టెస్లా" అనే బ్రాండ్ ప్రపంచం మొత్తం పాపులర్. డ్రైవర్ లెస్ కార్లు.. అన్నీ ఎలక్ట్రిక్ కార్లు. అత్యంత ఖరీదైనప్పటికీ మన దేశంలో కొంత మంది కుబేరులు వంద శాతానికిపైగా పన్ను చెల్లించి దిగుమతి చేసుకున్నారు. ఈ కార్లను ఇండియాలో అమ్మాలని ఎలన్ మస్క్ కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. బెంగళూరులో టెస్లా ఆర్ అండ్ డీని ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ మస్క్ మాత్రం తరచూ తనకు భారత్‌లో అనేక సవాళ్లు ఎదురవుతున్నట్లుగా ట్వీట్లు చేస్తున్నారు. ఆ ట్వీట్లకు రిప్లయ్‌గా కొన్ని రాష్ట్రాల మంత్రులు పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి.
ఎలన్ మస్క్ ఇండియాలో ఎదుర్కొంటున్న సవాళ్లేంటో ట్వీట్లు చేసిన మంత్రులకు తెలుసా ?
టెస్లాకు అవసరమైన సహాయం అందిస్తామని తెలంగాణలో ప్లాంట్ పెట్టాలని తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ముందుగా ట్వీట్ చేశారు. ఇండియాకు రావడానికి తనకు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని ఓ ట్వీట్‌కు మస్క్ ఇచ్చిన రిప్లయ్‌కు కేటీఆర్ ఈ కామెంట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ వైరల్ అయింది. వెంటనే ఇదేదో బాగుందని ఇతర రాష్ట్రాల పరిశ్రమల మంత్రులూ ఒక‌్క ట్వీటేగా పోయేదేముందని ట్వీట్లు చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్ ,వెస్ట్ బెంగాల్ పరిశ్రమల మంత్రులు తాము కూడా టెస్లాను ఆహ్వానిస్తున్నామన్నారు. అంతే కాదు తమ రాష్ట్ర ప్లస్ పాయింట్లను ప్రమోట్ చేసుకున్నారు. మస్క్ ఇండియాలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకోవడానికి సాయం చేస్తామన్నారు. అయితే వీరికి ఆ సవాళ్ల గురించి కనీస అవగాహన లేదని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సవాళ్లను పరిష్కరించే అధికారం రాష్ట్రాలకు లేదు.
Also Read: KTR Elon Musk : మస్క్ గారూ.. టెస్లాతో తెలంగాణ వచ్చేయండి..! కేటీఆర్ పిలుపు వైరల్
ఎలన్ మస్క్ కు సవాళ్లు అంటే .. పన్ను రాయితీలే !
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఎలన్ మస్క్ కేంద్రాన్ని కోరుతున్నారు. గతంలో ఇదే విజ్ఞప్తితో ఆయన ట్వీట్లు కూడా చేశారు. తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కంపెనీ కోరినట్టు దిగుమతి సుంకంపై రాయితీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. ఎలక్ట్రిక్ కార్లను బయటి నుంచి తెచ్చి విక్రయిస్తే, దిగుమతి సుంకంలో ఎలాంటి మినహాయింపు లభించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా కార్లు చాలా ఖరీదైనవి. ఇండియాలో దిగుమతి చేసుకుంటే నూరుశాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. అమెరికా మార్కెట్ లో ఉన్నధరకు సమానంగా సుంకం ఉంటుంది. ఈ పన్నులను తగ్గించాలని మస్క్ కోరుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది.
Also Read: మళ్లీ సర్‌ప్రైజ్ చేసిన మస్క్! ఆటోపైలట్ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక
తయారీ ప్లాంట్ పెట్టమంటున్న కేంద్రం ప్రభుత్వం !
టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పితేనే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఒక వేళ పన్ను మినహాయింపు ఇస్తే ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని అది దేశానికి చాలా నష్టమని కేంద్రం చెబుతోంది. ప్లాంట్ పెట్టి అమ్ముకోవచ్చు కదా అని ఎలన్‌మస్క్‌ను అడిగితే.. ఆయన తెలివిగా సమాధానం చెబుతున్నారు. దిగుమతి చేసుకున్న కార్లతో కంపెనీ తన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకోగలిగితే, భారతదేశంలో ఒక ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.
Also Read: క్రేజీ ఎలన్ మస్క్! టెస్లా నుంచి మొబైల్ ఫోన్.. ఫీచర్లు ఇవే!!
ఎలన్ మస్క్ అసలు వ్యూహం వేరంటున్న ఆటో ఇండస్ట్రీ !
టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉందని ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. ఈ వ్యూహంతోనే ఎలన్ మస్క్ తరచూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా.. సవాళ్లు ఎదురవుతున్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై తప్పుడు అభిప్రాయం కలిగేలా చేస్తున్నారు. కానీ ఆయన వ్యాపార ప్రణాళిక మాత్రం చెప్పడం లేదు.
Also Read: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!
పన్ను తగ్గింపు సవాళ్లను రాష్ట్రాలు ఎలా పరిష్కరించగలవు !?
ఎలన్ మస్క్ ఏం సవాళ్లు ఎదుర్కొంటున్నారో లోతైన పరిశీలన జరపకుండా.. వివిధ రాష్ట్రాల మంత్రులు ట్వీట్లు చేశారు. వారు హామీ ఇచ్చినట్లుగా పన్ను మినహాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాయం చేయలేవు. కాకపోతే ప్లాంట్ పెట్టాలనుకుంటే ఉచితంగా భూమి, విద్యత్.. ఇతర పన్ను మినహాయింపులు ఇవ్వొచ్చు. కానీ మస్క్‌కు ఇండియాలో ప్లాంట్ పెట్టే ఉద్దేశమే లేదనేది ఎక్కువ మంది చెప్పే మాట .
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Breaking News Live Updates: హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి