By: ABP Desam | Updated at : 19 Dec 2021 10:21 AM (IST)
సింథసిస్ స్కూల్
తెలంగాణకు చెందిన విద్యార్థి మన దేశంలోనే అరుదైన ఘనత సాధించాడు. ఏకంగా ఓ అత్యున్నతమైన పాఠశాలలో అడ్మిషన్ సాధించి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. అమెరికాలో స్పేస్ ఎక్స్ కంపెనీ చీఫ్, టెస్లా సీఈవో అయిన ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూలులో చేరడానికి అర్హత పొందాడు. ఈ ఆరో తరగతి చదివే బాలుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన వాడు. ప్రస్తుతం వరంగల్ నగరంలోని గోపాలపూర్‌లో నివసిస్తున్నాడు. తండ్రి విజయ్ పాల్ జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో గవర్నమెంట్ టీచర్. వీరి చిన్న కుమారుడే సింథసిస్‌లో అర్హత పొందిన అనిక్ పాల్. ప్రస్తుతం ఈ బాలుడు నిట్ సమీపంలోని గవర్నమెంట్ ఆర్‌ఈసీ పాఠక్ స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాడు.
సింథసిస్ స్కూల్ గొప్పతనం ఏంటంటే..
ఈ స్కూలును స్పేస్ ఎక్స్ కంపెనీ చీఫ్, టెస్లా సీఈవో అయిన ఎలన్ మస్క్ స్థాపించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ, బోధన పద్ధతులు విద్యార్థుల్లో సరైన నైపుణ్యాలు అందించలేకపోతున్నాయని ఈ సింథసిస్ స్కూలును స్థాపించారు. ఇందులో 21వ శతాబ్దపు టెక్నాలజీ బేస్డ్‌గా బోధన ఉంటుంది. ఇక్కడ ప్రయోగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఈ పాఠశాల గురించి తెలుసుకున్న గవర్నమెంట్ టీచర్ విజయ్ పాల్ తమ కొడుకును అందులో చేర్పించాలని అనుకున్నాడు. అందుకు విద్యార్థికి ఏ నైపుణ్యాలు ఉండాలో, ఏ అర్హతలు ఉండాలో తెలుసుకొని తన కుమారుడు అనిక్ పాల్‌కు అవన్నీ నేర్పించాడు.
లభించిన అడ్మిషన్
ఈ సింథసిస్ స్కూలులో చేరాలంటే.. ఎంట్రన్స్ టెస్ట్ 3 లెవెల్స్ ఉంటుంది. సింథసిస్ పాఠశాల మేనేజ్ మెంట్ వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలను ఇచ్చి వాటిని విద్యార్థులు ఎలా ఆన్సర్ ఇస్తున్నారన్న దాన్ని పరిశీలిస్తారు. మొదటి రెండు రౌండ్లలో అనిక్ పాల్ సులువుగానే సమాధానాలు ఇవ్వగలిగాడు. తర్వాత మరో వివరణాత్మక సమస్యకు సమాధానంగా వీడియో రూపొందించి పంపించాడు. చివరిగా ఆన్‌లైన్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహించాడు. దీంతో బాలుడి నైపుణ్యాలు మెచ్చిన సింథసిస్ యాజమాన్యం అనిక్ పాల్‌కు ఈ నెల 12న ఆరో తరగతిలో ప్రవేశం కల్పించింది. దీంతో సింథసిస్ యాజమాన్యం ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తోంది. కరోనా నిబంధనలు పూర్తిగా ఎత్తివేసిన తరువాత అమెరికాకు పంపిస్తామని తండ్రి విజయ్ పాల్ తెలిపారు. అక్కడ ఇంటర్ వరకు ప్రపంచ స్థాయి టీచర్లు, సిబ్బందితో చదువుకునే అవకాశం ఉండనుంది.
ఈ నైపుణ్యం చాలా అరుదు
చాలా మంది పిల్లలు ఆన్ లైన్ వీడియో గేమ్స్ ఆడతారు. అనిక్ పాల్ మాత్రం వీడియో గేమ్స్ ఆడి వదిలేయకుండా వీటిని ఎలా రూపొందిస్తారనే కోణంలో అన్వేషణ మొదలుపెట్టేలా అతని తండ్రి చేశాడు. ఈ క్రమంలోనే కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్‌లు నేర్చుకున్నాడు. మేషిన్ లెర్నింగ్ సర్టిఫికెట్ కోర్సు కూడా కంప్లీట్ చేశాడు. ఐఐటీ మద్రాస్ నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ ప్రోగ్రాంలో అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు సమర్పించి గ్రేట్ అనిపించుకున్నాడు.
Also Read: Omicron Cases: తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్... కొత్తగా 12 కేసులు
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!
TSPSC Group1 Exam: గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్, 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Telangana: 9 ఏండ్లల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి
Gadwal News: గద్వాలలో దారుణం - సరదాగా ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
Amit Shah Vizag Tour: కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా, అయినా బీజేపీ అగ్రనేతల వరుస సభలు
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు