అన్వేషించండి

Viral News: అక్కడ పది రోజుల్లో వెయ్యి భూకంపాలు - ఖాళీ చేసి వెళ్లిపోయిన జనం - ఎక్కడో తెలుసా ?

Greek island : ఎప్పుడో ఓ సారి భూకంపం వస్తేనే వణికిపోతాం. కానీ అక్కడ పది రోజుల్లో వెయ్యి భూకంపాలు వచ్చాయి.

Over 1,000 earthquakes Why this Greek island is shaking since January 27:  భూకంపం అంటే వణికించేదే. ఒకసారి భూకంపం  వస్తే ఆ ప్రాంతంలో ఉండటం మంచిదా కాదా అని ఆలోచిస్తాం. అలాంటిది ఆ ప్రాంతంలో పది రోజుల్లో వెయ్యి భూకంపాలు వచ్చాయి. గ్రీకు దీవులైన శాంటోరిని , అమోర్గోస్‌లు జనవరి 27 నుండి, నిరంతర భూకంపాలు వణికిపోతున్నాయి. 1,000 కంటే ఎక్కువ భూప్రకంపనలు ఈ పది రోజుల కాలంలో నమోదయ్యాయి. నిరంతర ప్రకంపనల కారణంగా 
అక్కడ నివసిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఆ దీవులలో వస్తున్న భూకంపాలలో అత్యధికం 3 నుంచి   4.9 మధ్య తీవ్రతతో ఉంటాయి. వందలాది భూప్రకంపనలు  శాంటోరిని ద్వీపంతో పాటు సమీపంలోని అమోర్గోస్ ద్వీపంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రెండు దీవులను అత్యంత పవిత్రమైన దీవులుగా పిలుస్తూ ఉంటారు. 

ఎప్పుడు చూసినా వణికిపోతున్నట్లుగా ఉండే వాతావరణంలో ఉండలేక.. తాము ఉన్న ప్రాంతం ఇప్పుడు కూలిపోతుందో అర్థం కాక ఆందోళనతో  అక్కడ నివసిస్తున్న వారంతా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.  కొద్ది రోజుల్లోనే ఆ దీవులలో నివసిస్తున్న ప్రజలు పదివేల మంది ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రతీ రోజూ చుట్టుపక్కల సముద్రంలో వందలాది చిన్న భూకంపాలు నమోదవుతున్నాయి.  భవనాలు కుదుపుకు గురవతున్నాయి. ద్వీపంలోని కొండలపై ఉన్న దుమ్ము ఈ కుదుపుల కారణంగా గాలి వచ్చినప్పుడు గాల్లోకి లేచినట్లుగా లేస్తోంది. ఈ పరిణామాలతో అతి పెద్ద భూకంపం వస్తే ఆ ప్రాంతం అంతా కుప్పకూలిపోతుందని శిథిలంగా మారుతుందన్న భయంతో చాలా మంది ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. 

జియోడైనమిక్ ఇన్స్టిట్యూట్ ప్రకారం .. మూడు  కంటే తక్కువ 440 భూకంపాలు సంభవించాయి. బుధవారం ప్రకంపనలు తగ్గాయని స్థానికులు , ప్రభుత్వ అధికారులు చెప్పారు కానీ తీవ్రత తగ్గి ఉంటుంది కానీ భూకంపాలు కాదని భావిస్తున్నారు. ఈ భూకంప తీవ్రతల్లో అత్యధికంగా 5.1.  భూకంప శాస్త్రవేత్తలు ఈ ప్రకంపనలను స్టర్లలో సంభవించే   శ్రేణిగా అభివర్ణించారు. అయితే ఇన్ని ప్రకంపనలుు ఉన్నా భారీ తీవ్రత ఉన్న భూకంపం రాకపోవడం మాత్రం విచిత్రమేనని అంటున్నారు. ఇలాంటి ప్రకంపనలు వరుసగా వస్తూంటే.. పెద్ద  భూకంపం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఐరోపాలో భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉన్న దేశాల్లో గ్రీస్ ఒకటి. ఇది ఆఫ్రికన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉంది. ఇక్కడ నిరంతర కదలికల వర్రకూ తరచుగా భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. భూకంప కేంద్రాలు సముద్రగర్భం క్రింద ఉన్నాయని.. ఎప్పుడైనా సునామీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సింది లేదని పరిశోధకులు చెబుతున్నారు. 

భారీ భూకంపం వస్తే సమస్యలు వస్తాయి కాబట్టి  గ్రీకు అధికారులు అత్యవసరంగా తీసుకోవాల్సి న చర్యలను తీసుకున్నారు.  శాంటోరిని, అనాఫీ, అమోర్గోస్, ఐయోస్‌లలో స్కూళ్లను మూసివేశారు. ప్రత్యేక రెస్క్యూ బృందాలను పంపించారు  కొండచరియలు విరిగిపడే ప్రమాదం కారణంగా ఆయా ప్రాంతాల నుంచి మనుషుల్ని తరలించారు.                

Also Read: ఇన్‌ఫోసిస్, ఎల్ అండ్ టీ పెద్దలనుకుంటే వాళ్ల తాత ఎలాన్ మస్క్ - వారానికి 120 గంటలు పని చేయాలట !

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget