By: ABP Desam | Updated at : 16 Dec 2021 10:49 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఫైజర్ ఒమిక్రాన్ టాబ్లెట్(Source Getty Images)
ఒమిక్రాన్ అత్యవసర చికిత్స కోసం ఫైజర్ కోవిడ్ టాబ్లెట్(మాత్ర)ను వినియోగించేందుకు యూరోపియన్ యూనియన్ అనుమతి ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ (EU) ఔషధ ఉత్పత్తుల మూల్యాంకనం, పర్యవేక్షణకు బాధ్యత వహిస్తున్న యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) ఫైజర్ కోవిడ్ మాత్ర అత్యవసర ఉపయోగం కోసం అధికారిక ఆమోదం తెలిపిందని AFP వార్తా సంస్థ తెలిపింది.
#BREAKING EU medicines agency (EMA) recommends two new Covid treatments, Kineret and Xevudy pic.twitter.com/ASBxddMnWl
— AFP News Agency (@AFP) December 16, 2021
ఒమిక్రాన్ పై ప్రభావవంతంగా
ఈయూ రెగ్యులేటర్ బ్లాక్ లో కరోనా వైరస్ కు ముందుగా మరో రెండు చికిత్సలను సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఇది అందుబాటులోకి వస్తుంది. స్వీడన్ ఆర్ఫన్ బయోవిట్రమ్ ద్వారా ఉత్పత్తి చేసే కైనెరెట్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ గ్జెవుడే డ్రగ్ చిక్సిత్సను సిఫార్సు చేసింది. సుమారు 1,200 మంది రోగులలో ఫైజర్ ఈ టాబ్లెట్ ను పరిశోధించింది. ఈ పిల్ ప్లేసిబోతో పోల్చినప్పుడు ఆసుపత్రిలో చేరడం లేదా మరణాలను తగ్గించడంలో దాదాపు 89 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని ఫైజర్ నివేదించింది. ఇటీవలి ల్యాబ్ డేటా ప్రకారం యాంటీవైరల్ కోవిడ్-19 మాత్రలు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తాయని సూచించింది. మరో 1000 మందిపై పరిశోధనలు చేసినట్లు మంగళవారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది.
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
90 శాతం సామర్థ్యంతో పనిచేసిన పాక్స్ లోవిడ్
కోవిడ్ సోకిన వారిలో అధిక ప్రమాదం ఉన్న రోగులలో ఆసుపత్రిలో చేరడం, మరణాలు నివారించడంలో ఈ ఔషధం దాదాపు 90 శాతం సామర్థ్యాన్ని చూపించిందని ఫైజర్ కంపెనీ పేర్కొందని రాయిటర్స్ నివేదించింది. ఈ ఔషధం తీసుకున్న వారిలో మరణాలు సంభవించలేదని తెలిపింది. కానీ ప్లేసిబో టాబ్లెట్ గ్రహీతలలో 12 మరణాలు నమోదయ్యాయి. లక్షణాలు కనిపించిన తర్వాత ఐదు రోజుల పాటు ప్రతి 12 గంటలకు ఒకసారి ఫైజర్ మాత్రలు యాంటీవైరల్ రిటోనావిర్‌తో తీసుకోవాలి. అనుమతులు పొందిన తర్వాత దీనిని 'పాక్స్‌లోవిడ్'గా విక్రయిస్తామని ఫైజర్ పేర్కొంది. రెండో క్లినికల్ అధ్యయనం ప్రాథమిక ఫలితాలలో 600 మందిలో సుమారు 70 శాతం కోవిడ్ బారిన పడకుండా ఉన్నారని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఈ ఏడాది 1,80,000 టాబ్లెట్ కోర్సులను అందించగలమని, 2022లో కనీసం 80 మిలియన్లను ఉత్పత్తి చేయాలని చేస్తామని ఫైజర్ పేర్కొంది.
Also Read: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kurla Building Collapse: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం- 11 మంది మృతి
ONGC Chopper: అరేబియా సముద్రంలో పడిపోయిన ONGC చాపర్- నలుగురు మృతి
Breaking News Live Telugu Updates: గుడివాడలో తెలుగుదేశం మినిమహానాడు వాయిదా
T Hub 2 Inauguration Live Updates: ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్టార్టప్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
ED Summons Sanjay Raut: సంజయ్ రౌత్‌కు మరో షాక్- ఆ కేసులో మరోసారి ఈడీ సమన్లు
July First Release : జూలై 1 విడుదల - వీటి గురించి తెలుసుకోకపోతే ఖర్చలెక్కువైపోతాయ్ !
Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్
CM Jagan On Health Review : వైద్యం ఖర్చు రోగి ఖాతాకు బదిలీ - ఆరోగ్యశ్రీలో కీలక మార్పులకు సీఎం జగన్ ఆదేశం !
AP BJP : ఏపీ బీజేపీ బలపడుతోందా ? ఉపఎన్నికల ఫలితాలు ఏం చెబుతున్నాయి ?