Omicron: తెలంగాణలో కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు... 7కు చేరిన మొత్తం కేసులు
తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తోంది. తాజాగా మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరింది.
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో నలుగురిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఒకరు ఎట్ రిస్క్ దేశాల నుంచి రాగా, మరో ముగ్గురు నాన్ రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో ముగ్గురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, తాజా కేసులతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది.
Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!
కొత్తగా 4 ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా మరో నలుగురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురికి, భారత్‌కు చెందిన మరో వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 7కు చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదుల చేసిన బులెటిన్ లో పేర్కొంది. తెలంగాణకు ఎట్ రిస్క్ దేశాల నుంచి 6,764 మంది ప్రయాణికులు రాగా వారిలో 21 మందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్‌గా వచ్చింది. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధికారులు పంపించారు. వాటిల్లో 17 మందికి ఒమిక్రాన్ నెగెటివ్‌గా రాగా, ఏడుగురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చింది. మరో ముగ్గురి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
Also Read: భారత్ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!
రాష్ట్రంలో కొత్తగా 190 పాజిటివ్ కేసులు
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 40,103 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో కొత్తగా 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,79,064కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. బుధవారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,012కి చేరింది. కోవిడ్ బారి నుంచి నిన్న 195 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,805 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Also Read: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి