By: ABP Desam | Updated at : 16 Dec 2021 08:10 AM (IST)
పెరగనున్న అమ్మాయి వివాహ వయసు
2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... అమ్మాయి పెళ్లి వయసును 21సంవత్సరాలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఏడాదిన్నర తర్వాత ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పురుషులతో సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు అంగీకారం లభించింది.
కేబినెట్ ఆమెదించిన బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్ట సవరణను పార్లమెంట్ ముందుకు రానుంది. అదే టైంలో
ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టం, 1955 వంటి వ్యక్తిగత చట్టాలకు సవరణలు తీసుకొస్తుంది.
తల్లిమరణాల రేటు తగ్గించి... MMR, పోషకాహార లోపాలు పరిశీలించేందుకు జయజైట్లీ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిశోధించింది. చాలా మంది నిపుణులతో మాట్లాడింది. సమస్యలు తెలుసుకొని... కొన్ని సిఫార్సులతో తన రిపోర్టును 2020 డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు ఇచ్చింది. దీన్ని పరిశీలించిన కేంద్రమంత్రి మండలి బుధవారం దీనికి ఆమోదం తెలిపింది.
జనాభా నియంత్రణ కోసమే ఈ సిఫార్సులు చేయలేదన్నారు జయజైట్లీ. ఇటీవలే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫెర్టిలిటీ రేట్ తగ్గుతోందని చెప్పింది. జనాభా నియంత్రణలోనే ఉందని చెప్పారు. అందుకే తమ తాము మహిళా సాధికారత కోసం ఈ సిఫార్సులు చేసినట్టు చెప్పారు జయజైట్లీ.
ఇటీవలే విడుదలైన NFHS-5 పరిశీలిస్తే... దేశంలో సంతానోత్పత్తి రేటు 2కి చేరుకుంది. TFR పున:స్థాపన స్థాయి 2.1 కంటే తక్కువగా ఉంది. ఈ లెక్కలు చూస్తే రాబోయే రోజుల్లో జనాభా భారీగా పెరిగే ఛాన్స్ లేదనిపిస్తోంది. 2015-16లో 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు 2019-21లో 23శాతనికి పడిపోయాయని తేలింది.
ఈ సర్వేలో జయజైట్లీ చాలా అంశాలపై విస్తృతంగా స్టడీ చేశారు. నిపుణులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. యువకులతో మాట్లాడారు. యువతుల వివాహ వయసు పెంపు ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుందన్నారు జైట్లీ.
టాస్క్‌ఫోర్స్ కమిటీ చాలా విశ్వవిద్యాలయాల్లో యువతతో మాట్లాడింది. చాలా మంది ఎన్జీవోలతో మాట్లాడారు. గ్రామీణ, అణగారిన వర్గాల్లో బాల్యవివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని తేలింది. దీనిపై మతాలకు అతీతంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభిప్రాయలు తీసుకున్నట్టు టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది.
వివాహ వయసు 22-23 ఏళ్లకు పెంచాలని చాలా మంది యువత అభిప్రాయపడ్డారు. మరికొందరు దీనిపై అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అన్నింటినీ పరిశీలింటిన టాస్క్‌ఫోర్స్ కమిటీ చివరకు అమ్మాయిల వివాహ వయసు అబ్బాయిలతో సమానంగా ఉండాలని సిఫార్సు చేసింది.
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2020లో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో నీతి ఆయోగ్‌కి చెందిన డాక్టర్ వికె పాల్, డబ్ల్యుసీడీ, ఆరోగ్యం, విద్యా మంత్రిత్వ శాఖలు, శాసన శాఖ కార్యదర్శులు ఉన్నారు.
ఈ నిర్ణయ ఆమోదం కోసం సమగ్ర ప్రజాచైతన్యం అవసరమని టాస్క్‌ఫోర్స్ కమిటీ భావించింది. సుదూర ప్రాంతాల్లోని విద్యాసంస్థల విషయంలో రవాణా సౌకర్యంతో సహా బాలికల కోసం పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా ప్రవేశం కల్పించాలని సిఫార్సు చేసింది.
సెక్స్ ఎడ్యుకేషన్‌ను అధికారికం చేసి పాఠశాలో పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో మహిళలకు శిక్షణ, నైపుణ్యాలు, వ్యాపార శిక్షణ, జీవనోపాధిని పెంపొందించడం కూడా వివాహ వయస్సుపై ప్రభావం చూపుతాయని కమిటీ అభిప్రాయపడింది.
అమ్మాయిలకు ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పుడు.. తల్లిదండ్రులు వారికి త్వరగా పెళ్లి చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారని కమిటీ కామెంట్ చేసింది.
వధువు కనీస వయస్సు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు ఉండాలని హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 5(iii)చెప్పింది. 1954లో చేసన ప్రత్యేక వివాహ చట్టం, 2006లో చేసిన బాల్య వివాహాల నిషేధ చట్టం కూడా వివాహానికి కనీస వయస్సును 18, 21 సంవత్సరాలుగానే చెప్పాయి.
2020-21 బడ్జెట్ ప్రసంగంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటును ప్రస్తావించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...'1978లో 1929 నాటి శారదా చట్టాన్ని సవరించి మహిళల వివాహ వయస్సును 15 సంవత్సరాల నుంచి 18ఏళ్లకు పెంచారు. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు మహిళలు ఉన్నత శిఖరాలకు చేరుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటోంది. MMRని తగ్గించి, పోషకాహార అందివ్వగలిగితే అద్భుతాలు చేస్తారన్నారు.
Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి
Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి
Drone Mahotsav 2022: దేశంలో డ్రోన్ల సాంకేతికతతో సరికొత్త విప్లవం: మోదీ
Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు
Single Leg Student : ఒంటి కాలుతో చదువు కోసం కిలోమీటర్ల నడక - ఈ పాప కదిలించేసింది !
Manjusha Neogi Death: కోల్‌కతాలో మరో మోడల్ మృతి- 2 వారాల్లో మూడో ఘటన!
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?