Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి
దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదుకాగా 247 మంది మృతి చెందారు.
దేశంలో కొత్తగా 6,984 కోరనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,10,628కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,562కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- కొత్త కేసులు: 6,984
- మొత్తం రికవరీలు: 8,168
- కొత్త మరణాలు: 247
మొత్తం మరణాల సంఖ్య 4,76,135కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
వ్యాక్సినేషన్..
దేశవ్యాప్తంగా టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.
ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 50 దాటింది. తాజాగా తెలంగాణలో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస రావు తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల మహిళతో పాటు సోమాలియాకు చెందిన 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు.
కెన్యా నుంచి వచ్చిన మహిళను టోలిచౌకిలో గుర్తించామని.. ఆమెను చికిత్స నిమిత్తం గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఒమిక్రాన్ సోకలేదని డీహెచ్ తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమాలియా నుంచి వచ్చిన యువకుడి ఆచూకీని హైదరాబాద్ పారామౌంట్ కాలనీలో పోలీసులు గుర్తించారు. బాధితుడిని నేరుగా టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి