Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ABP మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో రిపోర్టర్లను దూషించారు.
కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే విపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు.
లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన తన కుమారుడు ఆశిష్ మిశ్రా గురించి ABP రిపోర్టర్ ప్రశ్నించగా అజయ్ మిశ్రా ఫైర్ అయ్యారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | MoS Home Ajay Kumar Mishra 'Teni' hurls abuses at a journalist who asked a question related to charges against his son Ashish in the Lakhimpur Kheri violence case. pic.twitter.com/qaBPwZRqSK
— ANI UP (@ANINewsUP) December 15, 2021
SIT जांच से जुड़ा सवाल पूछने पर भड़के केंद्रीय गृह राज्यमंत्री अजय मिश्रा टेनी, abp न्यूज के रिपोर्टर को धमकाया, वीडियो में देखिए क्या कहा@awasthis @sangitatewari https://t.co/smwhXURgtc#LakhimpurCase #AjayMishraTeni pic.twitter.com/1IynJKWmpo
— ABP News (@ABPNews) December 15, 2021
అంతటితో ఆగని మంత్రి.. సదరు జర్నలిస్ట్ చేతి నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. రిపోర్టర్లను దొంగలుగా అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు అజయ్ మిశ్రా. ఆ సమయంలోనే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో..
లఖింపుర్ ఖేరీ ఘటనపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో ఘటనపై చర్చించాలని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్‌సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్.
అది హత్యే..
లఖింపుర్ ఖేరిలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. పక్కా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు మోపేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం)ను సిట్ అధికారి విద్యారామ్ దివాకర్ అభ్యర్థించారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి
Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి