అన్వేషించండి

Vijay Diwas 2021: భారత్‌ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!

బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పించేందుకు పాకిస్థాన్‌పై భారత సైనికులు పోరాడి గెలిచిన రోజు ఇది. ఆ విజయానికి గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నాం.

1971లో పాకిస్థాన్‌పై చేసిన యుద్ధంలో భారత్ గెలిచిన దానికి గుర్తుగా భారతీయులు విజయ్ దివస్ జరుపుకుంటారు. ఆ యుద్ధం కారణంగా బంగ్లాదేశ్ దేశం పుట్టింది. ఇదే రోజును బంగ్లాదేశ్‌లో 'బిజోయ్ దిబోస్‌'గా జరుపుకుంటారు. ఆ యుద్ధంలో భారత జవాన్లు చూపిన తెగువ, ధైర్యసాహసాల గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. మరి ఆ యుద్ధంలో ఏం జరిగింది?

ఏం జరిగింది?

సరిగ్గా 50 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలతో తూర్పు పాకిస్థాన్‌ (నేటి బంగ్లాదేశ్)లో స్వాతంత్య్ర పోరాటం మొదలైంది. అది కాస్త భారత్- పాక్ మధ్య యుద్ధానికి దారి తీసింది. 

ఆ భీకర పోరులో భారత సైనికుల పోరాట పటిమ ముందు పాక్ జవాన్లు తేలిపోయారు. 13 రోజులు పాటు ఈ యుద్ధం జరిగింది. చివరకు భారత్ సైన్యం పాక్‌ను ఓడించి, బంగ్లాదేశ్ అవతరణకు కారణమైంది.

ఆ విజయానికి గుర్తుగా భారత్ ప్రతి ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను నిర్వహిస్తుంది.

13 రోజుల యుద్ధం

Vijay Diwas 2021: భారత్‌ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!

ఈ యుద్ధం కేవలం 13 రోజులే జరిగింది. చరిత్రలో అతి తక్కువ యుద్ధాలలో ఇది ఒకటి. భారతదేశం- పాకిస్థాన్ మధ్య సైనిక ఘర్షణ 1971, డిసెంబర్ 3 నుంచి 1971, డిసెంబర్ 16 వరకు జరిగింది. యుద్ధంలో భారత్ గెలిచిన తర్వాత 93,000 మంది సైనికులను స్వాధీనం చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని 75 మిలియన్ల ప్రజలకు స్వాతంత్ర్యం తెచ్చింది.

తూర్పు పాకిస్థాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్థాన్ చేసిన మారణహోమాన్ని అంతం చేయడానికి జరిగిన ఈ యుద్ధంలో 3000 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీనితో పాటు 8,000 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారు. యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం సిద్ధించింది.

ప్రధాని ట్వీట్..

50వ విజయ్​ దివస్​ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఈరోజు ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుందన్నారు.

" భారత సాయుధ దళాలకు చెందిన ముక్తిజోద్ధులు, బీరంగనాదులు, ధైర్యవంతుల గొప్ప శౌర్యాన్ని, త్యాగాన్ని నేను స్మరించుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఈరోజు ఢాకాలో రాష్ట్రపతి పర్యటించటం భారత్‌కు మరో విశేషం                                         "
- ప్రధాని నరేంద్ర మోదీ

Also Read: India New CDS: భారత నూతన COSCగా ముకుంద్ నరవాణే బాధ్యతల స్వీకరణ

Also Read: Central Cabinet: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం

Also Read: Kamareddy: ఈ ఊర్లో లిక్కర్ అమ్మితే రూ.లక్ష, కొనాలంటే రూ.50 వేలు.. నాలుగేళ్ల నుంచి ఇంతే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Project: 2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
2026 అక్టోబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి - షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
TDP:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
Prabhas : షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
షూటింగ్​లో ప్రభాస్‌కు మళ్లీ గాయం.. జపాన్ ప్రేక్షకులకు సారీ చెప్పేశాడు, ఎందుకంటే
Telangana Assembly Sessions: ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ప్రభుత్వంపై ప్రివిలేజ్ మోషన్- స్పీకర్ అనుమతి కోరిన బీఆర్‌ఎస్- హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
UPI Lite: యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
యూపీఐ లైట్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా? - తెలిస్తే ఇన్ని బెనిఫిట్స్‌ వదులుకోరు!
Visakha News: నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
నిద్రలో పొట్టలోకి పళ్ల సెట్టు - అరుదైన చికిత్స చేసిన విశాఖ వైద్యులు
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Embed widget