Tesla: మళ్లీ సర్‌ప్రైజ్ చేసిన మస్క్! ఆటోపైలట్ హెడ్‌గా చెన్నై వ్యక్తి ఎంపిక
ఎలన్ మస్క్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోపైలట్ బృందానికి భారత సంతతి వ్యక్తి అశోక్ ఎలుస్వామిని ఎంపిక చేశానని ప్రకటించారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన కంపెనీ ఎలక్ట్రిక్ ఆటోపైలట్ బృందానికి భారత సంతతి వ్యక్తి అశోక్ ఎలుస్వామిని ఎంపిక చేశానని ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటన్న సంగతి తెలిసిందే.
'నా ట్వీట్ ద్వారా రిక్రూట్ చేసుకున్న మొదటి వ్యక్తి అశోక్. టెస్లా ఒక ఆటో పైలట్ టీమ్‌ను ఆరంభించబోతోంది' అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. ఆటో పైలట్ ఇంజినీరింగ్ విభాగం హెడ్‌గా అశోక్ ఉంటాడని ఆయన పేర్కొన్నారు.
'ఏఐ డైరెక్టర్‌గా ఆండ్రెజ్ ఉంటాడు. చాలాసార్లు ప్రజలు ఆండ్రెజ్‌కు, నాకూ ఎక్కువ క్రెడిట్ ఇస్తుంటారు. టెస్లా ఆటో పైలట్ ఏఐ టీమ్ అంతా ప్రతిభాశాలులే. ప్రపంచంలోని అత్యంత స్మార్ట్ ప్రజల్లో వీరు కచ్చితంగా ఉంటారు' అని మస్క్ తెలిపారు.
So much of AI is about compressing reality to a small vector space, like a video game in reverse
— Elon Musk (@elonmusk) December 27, 2021
టెస్లాలో చేరడానికి ముందు అశోక్ ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబ్, వాబ్కో వెహికిల్ కంట్రోల్ సిస్టమ్‌లో పనిచేశారు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్ సిస్టమ్ డెవలప్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. కాగా ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించే సమస్యలకు పరిష్కారాలు వెతికే హార్డ్‌కోర్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నానని మస్క్ ఈ మధ్యే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతుల్లో భారతీయులు ముందుంటారని మస్క్ ఈ మధ్యే అన్నాడు. తన కంపెనీలో అతిపెద్ద పొజిషన్‌లో భారతీయుడిని రిక్రూట్ చేశారు. అమెరికాకు, అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు భారతీయులు ఎంతో సేవ చేస్తున్నారని పేర్కొన్నారు.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Lex asks great questions <a href="https://t.co/TlyuEGoOVA" rel='nofollow'>https://t.co/TlyuEGoOVA</a></p>— Elon Musk (@elonmusk) <a href="https://twitter.com/elonmusk/status/1475939200218370049?ref_src=twsrc%5Etfw" rel='nofollow'>December 28, 2021</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
Also Read: Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
Also Read: Dual Mode Vehicle: ఇది బస్సే కాదు రైలు కూడా.. ఐడియా సూపర్ ఉంది కదా!
Also Read: Alto 2022: త్వరలో ఆల్టో కొత్త మోడల్ కూడా... బడ్జెట్‌లో సూపర్ కారు!