Year End 2021: 2021లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
ఈ సంవత్సరం లాంచ్ అయిన టాప్-10 ఎస్‌యూవీ కార్లు ఇవే..
2021ని ఎస్‌యూవీ నామ సంవత్సరం అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో కార్లు కొనాలనుకునేవారు ఎక్కువ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. 2021లో హై ఎండ్ నుంచి బడ్జెట్ వరకు చాలా వరకు ఎస్‌యూవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ సంవత్సరం లాంచ్ అయిన టాప్-10 ఎస్‌యూవీలు ఇవే..
1. మహీంద్రా ఎక్స్‌యూవీ700
ఈ సంవత్సరం ఎక్కువ అంచనాలతో లాంచ్ అయిన ఎస్‌యూవీల్లో ఇది కూడా ఒకటి. దీనికి భారీ డిమాండ్ కూడా ఉంది. ఇప్పటివరకు లాంచ్ అయిన అత్యుత్తమ మహీంద్రా ఉత్పత్తి ఇదే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల్లో బెస్ట్ కూడా ఇదే.
2. ఎంజీ ఆస్టర్
ఎంజీ ఆస్టర్ కొంచెం చిన్న సైజులో ఉండే ఎస్‌యూవీ. దీనికంటే ఎక్కువ ధర ఉన్న ఎస్‌యూవీల్లోని ఫీచర్ల కంటే ఇందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. క్వాలిటీ, ఎక్విప్‌మెంట్, డిజైన్ వంటి అంశాల్లో ఆస్టర్ ముందంజలో ఉంది. చిన్న సైజు ఉండే కార్లను కోరుకునే వారికి ఆస్టర్ మంచి చాయిస్. ఇందులో వైడ్ ఇంజిన్/గేర్ బాక్స్ కాంబినేషన్లు కూడా ఉన్నాయి.
3. హ్యుండాయ్ అల్కజార్
ఈ కారు క్రెటా మీద బేస్ చేసుకుని రూపొందించినా.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇక టాప్ ఎండ్ అల్కజార్‌లో చాలా ప్రీమియం ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉంది. దీన్ని డ్రైవ్ చేయడం కూడా చాలా సులభం. క్రెటా కొనుగోలు చేయాలనుకునే వారు ప్రస్తుతం దీని వైపు చూస్తున్నారు.
4. ఫోక్స్‌వాగన్ టైగున్
ఫోక్స్‌వాగన్ ఈ మధ్యే లాంచ్ చేసిన టైగున్ కూడా మనదేశంలోని వినియోగదారులకు సరిగ్గా సూటయ్యేదే. దీని బిల్డ్ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ బాగుంటాయి. దీంతోపాటు క్యాబిన్ ఫీచర్లు కూడా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం లాంచ్ అయిన బెస్ట్ ఎస్‌యూవీల్లో టైగున్ కూడా ఒకటి.
5. స్కోడా కుషాక్
కుషాక్ డిజైన్ చూడటానికి కొంచెం స్కోడా తరహాలో ఉంటుంది. దీన్ని కూడా మనదేశ మార్కెట్ల కోసమే రూపొందించారు. రైడ్ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్‌ల మేలు కలయికే ఈ స్కోడా కుషాక్. ఈ ఎస్‌యూవీ మంచి ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ సంవత్సరం మనదేశంలో లాంచ్ అయిన ఉత్తమ ఎస్‌యూవీల్లో ఇది కూడా ఉండనుంది.
6. టాటా పంచ్
తక్కువ ధరలో ఎస్‌యూవీ కొనాలనుకుంటున్నారా? అయితే టాటా పంచ్ మీకు మంచి ఆప్షన్. టాటా మోటార్స్ దీన్ని ముఖ్యమైన మినీ ఎస్‌యూవీగా రూపొందించింది. ఇది చూడటానికి కూడా చాలా బాగుంది. ఇందులో పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్ అందించారు. ఈ సంవత్సరం అత్యుత్తమ ఎస్‌యూవీల్లో ఇది కూడా నిలవనుంది.
7. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఏ
ఈ కారు కొత్త తరం మెర్సిడెస్ బెంజ్‌ను పరిచయం చేసింది. కారు చిన్నగా ఉన్నప్పటికీ.. లుక్ మాత్రం లగ్జరీగా ఉంది. అలాగే దీన్ని డ్రైవ్ చేయడం కూడా చాలా సులభం. చిన్న సైజులో కార్లను ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.
8. సిట్రోయిన్ సీ5 ఎయిర్‌క్రాస్
ఫ్రెంచ్ కార్ల కంపెనీ సిట్రోయిన్ మనదేశంలో మొదటి కారును లాంచ్ చేసింది. అదే సిట్రోయిన్ సీ5 ఎయిర్ క్రాస్. ఈ కారు లుక్ చూడటానికి ఫ్రెంచీగా ఉంది. దీని స్టైలింగ్, రైడ్ క్వాలిటీ చాలా కొత్తగా ఉంది. ఇది ఎంతో స్పేషియస్‌గా, కంఫర్టబుల్‌గా ఉండనుంది.
9. ఆడీ క్యూ5
ఆడీ ఈ సంవత్సరం లాంచ్ చేసిన ముఖ్యమైన కార్లలో క్యూ5 కూడా ఒకటి. మనదేశంలో క్యూ5 బెస్ట్ సెల్లర్లలో ఒకటి. దీని కొత్త వెర్షన్‌లో ఎన్నో మార్పులు చేశారు. ఇందులో కొత్త పెట్రోల్ ఇంజిన్, కొత్త ఇంటీరియర్లు మరింత ఆకర్షణీయమైన లుక్ కూడా అందించారు.
10. జాగ్వార్ ఐ-పేస్
ఈ సంవత్సరం లాంచ్ అయిన ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ కార్లలో జాగ్వార్ ఐ-పేస్ కూడా ఉంది. దీని రేంజ్ కూడా ఎక్కువగా ఉండనుంది. ఇందులో అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందించారు. స్పోర్టియర్ హ్యాండ్లింగ్ సెటప్ కూడా ఇందులో ఉంది.
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?