By: ABP Desam | Updated at : 01 Jan 2022 05:22 PM (IST)
కొత్త ఏడాదిలో భారం అయినవి ఇవే..!
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకన్నంత ఊజీ కాదు కొత్త ఏడాదిలో లైఫ్ లీడ్ చేయడం. ఎందుకంటే రోజువారీగా అవసరమైన అనేక విషయాల్లో ప్రభుత్వం టాక్సులు పెంచేసింది. ఇవి మీ జేబుకు చిల్లు పెట్టడం ఖాయం. కొత్త ఏడాదిలో ఏమేం పెరగబోతున్నాయో ఓ సారి తెలుసుకు కుందామా ?
ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా ? అయితే ఇది గుర్తుపెట్టుకోండి !
ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. జనవరి 1, 2022 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలని జూన్ 2021లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు రూ. 20 గా ఉన్నాయి. ప్రతీ కస్టమర్‌కు తన సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు యథాప్రకారం కొనసాగుతాయి. ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ. 15 నుంచి రూ. 17 కి పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. నాన్ ఫైనాన్షియల్ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఈ ఇంటర్ ఛేంజ్ ఫీని రూ. 6 కి పెంచింది. ఈ మార్పు గత ఏడాది ఆగస్టు 1 నుంచే అమలులోకి వచ్చింది.
కార్లు మరింత భారం !
ఈ ఏడాది కారను కొనాలని ప్లాన్ చేసుకుని ఉంటే మీ బడ్జెట్‌ను మరింత పెంచుకోండి. ఎందుకంటే పన్నులు.. కార్ల తయారీలో ఉపయోగించే ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌లతో పాటు వివిధ లోహాల ధరలు బాగా పెరిగాయి. వాహన తయారీలో 75-80 శాతం వాటా ఈ లోహాలదే. దీంతో ఉత్పత్తి వ్యయం భారమైందని నిపుణులు చెబుతున్నారు.ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయాయనని కార్ల కంపెనీలన్నీ రేట్లు పెంచేశాయి. మారుతీ, ఆడి, మెర్సిడెస్ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు వెల్లడించాయి. టాటా కూడా కమర్షియల్ వాహనం ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోండా, రెనాల్ట్ కూడా రేపో మాపో పెంపు ప్రకటన చేయనున్నాయి.
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఆన్‌లైన్‌లో ఆటో బుక్ చేసుకుంటారా ? అయితే పన్ను పడుతుంది !
ఓలా,ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్, ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
బాబోయ్.. చెప్పులు కొన్నా 12 శాతం జీఎస్టీ కట్టాల్సిందే !
దుస్తులు, చెప్పులపై కేంద్రం జీఎస్టీ శ్లాబ్ రేట్లను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలనే నిర్ణయం తీసుకుంది. అయితే పలు రాష్ట్రాలు దుస్తులపై పన్ను పెంపు వద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు దుస్తులపై జీఎస్టీ పెంపును అంగీకరించడం లేదని స్పష్టం చేశాయి. జీఎస్టీ ని పెంచడం వల్ల ప్రజలకు భారమవుతుందని, దీనివల్ల జనవరి 1 నుంచి సామాన్యులు రూ. 1000 దుస్తులు కొంటే రూ. 120 జీఎస్టీ కట్టాల్సి వస్తుందని, ఇది ఆమోదయోగ్యం కాదని పలు రాష్ట్రాలు సూచించాయి. దీంతో దుస్తులపై జీఎస్టీ పెంపు వాయిదా వేశారు. కానీ చెప్పులు, బూట్ల పై కూడా జిఎస్టి 12 శాతం పెంచాలనే దానిపై వెనక్కి తగ్గలేదు.
ఫుడ్ డెలివరి యాప్స్‌లోజీఎస్టీ వడ్డింపు
జనవరి1 నుంచి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ప్రతి కస్టమర్ నుంచి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్ పెట్టే కస్టమర్‌లకు ఫుడ్ డెలివరీ యాప్స్ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది.గతంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్‌లో నిబంధనలు కఠినం !
పన్ను చెల్లింపుదార్లు జీఎస్టీ రిఫండ్స్‌ను క్లెయిమ్ చేసుకోవడానికి కొత్త సంవత్సరం నుంచి ఆధార్ ధ్రువీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన పాన్ నెంబర్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోనే జీఎస్టీ రీఫండ్స్ వేసేలా చర్యలు చేపట్టింది. పన్ను ఎగవేతల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఇందుకుగాను జీఎస్టీకి సంబంధించి వివిధ నిబంధనల్లో కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్ సవరణలు చేసింది.
Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Breaking News Live Telugu Updates: నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Dengue Cases In Telangana: ఆ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్స్, వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఏ సమస్య ఉండదు
KPHB Teche Murder: అల్లుడి అంతం కోసం 4.5 లక్షలకు సుపారీ, హత్య తర్వాత దూరంగా ఎడమకాలు! వెలుగులోకి కీలక విషయాలు
Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్
Driverless Car: సంగారెడ్డిలో డ్రైవర్ లేని కారు, అందులో ప్రయాణించిన కేంద్ర మంత్రి - మనుషుల్ని మోసే డ్రోన్లు కూడా
CM Jagan : తెలంగాణ నుంచి ఆ డబ్బులు ఇప్పించండి, ప్రధానిని కోరిన సీఎం జగన్
Smita Sabharwal Job Tips: నిరాశ చెందవద్దు, ప్రణాళికా ప్రకారం ప్రిపేర్ అవ్వాలి - ఉద్యోగార్థులకు స్మితా సబర్వాల్ సూచనలివే
Pavitra Lokesh: నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?
Xiaomi 12S Ultra: వన్‌ప్లస్, యాపిల్‌తో పోటీ పడే ఫోన్ లాంచ్ చేసిన షియోమీ!