Kannauj IT Raid: పుష్ప.. పుష్పరాజ్.. ఫ్లవర్ అనుకుంటివా? అత్తరు.. ఈ కథే వేరు!
పుష్పరాజ్ అనే అత్తరు వ్యాపారి ఇంట్లో ఐటీ శాఖ దాడులు చేసింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పలువురు ఇళ్లపై ఈ దాడులు జరిగాయి.
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల పీయూష్ జైన్ అనే అత్తరు వ్యాపారి ఇంట్లో 197 కోట్ల డబ్బు, 26 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ తాజాగా కన్నౌజ్‌లోని మరో ఇద్దరు అత్తరు వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేసింది.
సమాజ్‌వాదీ పార్టీ..
ఏబీపీ న్యూస్ సమచారం మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఎమ్‌ఎల్‌సీ పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ, అత్తరు డీలర్ మాలిక్ మియాన్స్ నివాసాల్లో ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఐటీ శాఖ దాడులు చేపట్టింది. కోల్‌కతాలోని పుష్పరాజ్ జైన్‌కు చెందిన పలు సంస్థలకు సంబంధించిన దస్త్రాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఒకేసారి..
ఉత్తర్‌ప్రదేశ్‌లో పన్ను ఎగవేసిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేసింది ఐటీ శాఖ. కన్నౌజ్, కాన్పుర్, నేషనల్ కేపిటల్ రీజైన్, సూరత్ మాత్రమే కాకుండా ముంబయి సహా 20 ప్రాంతాల్లో ఈ సోదాలు చేసింది ఆదాయ పన్ను శాఖ.
రాజకీయ కక్షసాధింపు..
आदरणीय राष्ट्रीय अध्यक्ष श्री अखिलेश यादव जी के कन्नौज में प्रेसवार्ता की घोषणा करते ही भाजपा सरकार ने सपा एमएलसी पम्पी जैन के यहां छापामार कार्यवाही करनी शुरू कर दी।
— SamajwadiPartyMedia (@MediaCellSP) December 31, 2021
भाजपा का डर और बौखलाहट साफ है,
जनता भाजपा को सबक सिखाने के लिए तैयार है!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే భాజపా ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తుందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. రాజకీయ క్షక్షసాధింపు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని విమర్శలు చేసింది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సమాజ్‌వాదీ పేరుతో పుష్పరాజ్ ఓ పర్ఫ్యూమ్ను విడుదల చేశారు.
ఇటీవల జీఎస్టీ ఎగవేత కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు నిర్వాహించారు. కన్నౌజ్‌లోని ఆడ్కెమ్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల నుంచి ఇప్పటివరకు తాము రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ ఈ ఐటీ దాడులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. యూపీ ఎన్నికల్లో భాజపా, ఎస్పీ మధ్య తీవ్ర పోటీ నెలకొందని పలు సర్వేలు తెలిపాయి.
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Omicron Death: దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. గజగజ వణుకుతోన్న జనం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.