Liquor Sales: తెలంగాణలో కిక్ ఎక్కించిన మద్యం అమ్మకాలు.. ఈ 5 రోజుల్లో మందుబాబులు అన్ని కోట్లు తాగేశారా..!
Liquor Sales In Telangana: ఏదైనా సమయం, సందర్భం వచ్చిందంటే చాలు మందుబాబుల సంతోషానికి అవధులు ఉండవు. చలి పెరగడంతో డిసెంబర్ నెలలో రికార్డు స్థాయిలో తాగేశారు మందుబాబులు. ఎక్సైజ్ శాఖకు కిక్ ఇచ్చారు.
Liquor sales kicked off in Telangana: సాధారణంగానే తెలంగాణలో మద్యం అమ్మకాలు అధికంగా ఉంటాయి. అందులోనూ ఏదైనా సమయం, సందర్భం వచ్చిందంటే చాలు మందుబాబుల సంతోషానికి అవధులు ఉండవు. నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు.. ఈ ఏడాది మరింత జోరు పెంచాయి.
డిసెంబర్ 1 నుండి 31 వరకు రూ.3,459 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది డిసెంబర్‌లో రూ.2,764 కోట్ల కోట్ల విక్రయాలు జరిగాయి. దాంతో ఈ ఏడాది డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఏడాది మొత్తం కలుసుకుని రూ.30,196 కోట్లు తాగితే.. మందుబాబులు కేవలం సంవత్సరం చివరి 5 రోజుల్లో రూ.902 కోట్ల మద్యం తాగేశారు. డిసెంబరు 27 - 202.42 కోట్లు, డిసెంబర్ 28 - 155.48 కోట్లు, డిసెంబర్ 29 - రూ.149.53, డిసెంబర్ 30 - రూ.246.56 కోట్లు, డిసెంబర్ 31వ తేదీన రాత్రి 7 వరకే రూ.148.52 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 31న రాత్రి 7 వరకు రాష్ట్రంలో 172 కోట్ల రూపాయల మద్యం సేల్ చేశారు.
డిసెంబర్ నెలలో లిక్కర్ సేల్స్ రికార్డు
2021 ఏడాదిలో 3.68 కోట్ల కేసుల లిక్కర్.. 3 కోట్ల 25 లక్షల 82వేల 859 కేసుల బీర్లు మందుబాబులు కొన్నట్లు ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.6,979 కోట్ల మద్యం విక్రయాలు జరగగా.. నల్గొండ రూ.3,288 కోట్లు, హైదరాబాద్ రూ.3,201 కోట్ల అమ్మకాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది డిసెంబర్‌తో పోల్చుకుంటే ఈ 2021 డిసెంబర్‌లో సుమారు 700 కోట్ల మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి.
Also Read: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట... 12 మంది మృతి... ప్రధానమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?