PM Speech Teleprompter Issue: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్
రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. టెలిప్రామ్టర్‌లో లోపం వల్ల ప్రధాని ప్రసంగం నిలిచిపోవడంపై సెటైర్ వేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టెలీప్రామ్టర్ కూడా ప్రధాని మోదీ అసత్యాలను తట్టుకోలేకపోయిందని ట్వీట్ చేశారు.
इतना झूठ Teleprompter भी नहीं झेल पाया।
— Rahul Gandhi (@RahulGandhi) January 18, 2022
ఏం జరిగింది?
ప్రపంచ ఆర్థిక సదస్సుకు సోమవారం వర్చువల్‌గా హాజరై 'స్టేట్ ఆఫ్ ద వరల్డ్' అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే ఆ సమయంలో టెలీప్రామ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కాసేపు మోదీ మాట్లాడటం ఆపేశారు. కాసేపటి తర్వాత సాంకేతిక సిబ్బంది.. మోదీ మరోసారి తన ప్రసంగాన్ని పునఃప్రారంభించాలని చెప్పారు. దీని గురించి ప్రస్తావిస్తూ.. ప్రధాని మోదీ చెప్పే అసత్యాలకు టెలిప్రామ్టర్ కూడా తట్టుకోలేకపోయిందని రాహుల్ ట్వీట్ చేశారు.
ట్రెండింగ్‌లో..
ఈ ఘటనపై ట్విట్టర్‌లో మిశ్రమ స్పందన కనిపించింది. కొంతమంది టెలిప్రామ్టర్‌లో లోపం తలెత్తిందని ట్వీట్లు చేయగా మరికొందరు.. హ్యాష్ ట్యాగ్ #teleprompterPM.. ను ట్రెండింగ్ చేశారు.
కాంగ్రెస్..
Teleprompter guy: Achha chalta hun, duaon mein yaad rakhna#TeleprompterPM pic.twitter.com/1Zy11MF984
— Congress (@INCIndia) January 17, 2022
ఈ సంఘటనపై పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ట్వీట్ చేశారు. టెలిప్రామ్టర్‌తో ప్రసంగాలు మాత్రమే ఇవ్వగలమని.. పరిపాలన చేయలేమని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో సదరు వీడియోను కట్ చేసి షేర్ చేసింది.
Also Read: PM Security : ప్రధానిపై దాడికి ఉగ్రకుట్ర.. సంచలన విషయాలు వెల్లడించిన నిఘానివేదిక !?
Also Read: గూగుల్‌మీట్‌లో పెళ్లి వేడుక.. జోమాటో విందు డోర్ డెలివరీ ! మరి కానుకలు ఎలా తీసుకున్నారో తెలుసా ?
Also Read: ABP CVoter Survey: యూపీకి యోగి, ఉత్తరాఖండ్‌కు హరీశ్ రావత్.. సీఎంలుగా వీళ్లే కావాలట!
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
Also Read: Covid Cases: దేశంలో కొత్తగా 2 లక్షల 38 వేల కరోనా కేసులు.. దిల్లీ, ముంబయిలో తగ్గిన ఉద్ధృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి