ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఏబీపీ-సీ ఓటర్ సర్వే తాజా ఫలితాలు విడుదలయ్యాయి. మరి రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? అసలు ప్రజల్లో ట్రెండ్ ఎలా ఉంది? ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌కు సంబంధించి ఏబీపీ-సీ ఓటర్ తాజా ఓపీనియన్ పోల్స్ మీరే చూడండి.
యూపీలో భాజపా హవా..
ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా తిరిగి అధికారం చేపట్టనున్నట్లు తేలింది. గత నాలుగు సర్వే ఫలితాల ప్రకారం భాజపా.. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది.
జనవరి 6న చేసిన సర్వే ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా అధికారం చేపడుతుందని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని 7 శాతం మంది ప్రజలు అన్నారు.
జనవరి 3న చేసిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమకు ముఖ్యమంత్రిగా కావాలన్నారు. 32 శాతం మంది అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు. 15 శాతం మంది మాత్రమే మాయావతి సీఎం కావాలని కోరారు.
పంజాబ్‌లో ఆప్ ముందంజ..
పంజాబ్‌లో చేసిన సర్వే ప్రకారం 32 శాతం మంది ప్రజలు ఆమ్‌ఆద్మీ అధికారంలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 27 శాతం మంది కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. 11 శాతం మంది మాత్రం.. శిరోమణి అకాలీ దళ్- బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూటమి గెలుస్తుందన్నారు.
ప్రస్తుతం ఉన్న పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందా? మార్పు కోరుకుంటున్నారా? అని సర్వేలో అడిగిన ప్రశ్నకు 66 శాతం మంది ప్రభుత్వం మారాలని సమాధానమిచ్చారు. 34 శాతం మంది మాత్రం పంజాబ్ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని చెప్పలేదు.. అలాగని మళ్లీ ఇదే ప్రభుత్వం కొనసాగాలని చెప్పలేదు.
ఉత్తరాఖండ్‌లో కాషాయం..
ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం 40 శాతం మంది ప్రజలు భాజపాకు మద్దతు తెలిపారు. 36 శాతం మంది కాంగ్రెస్‌కు, 13 శాతం మంది ఆమ్‌ఆద్మీకి జై అన్నారు. మరో 11 మంది ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారు.
సీట్ల ప్రకారం.. భాజపా 33-39 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 29-35 స్ఖానాల్లో గెలుపొందే అవకాశం ఉండగా.. ఆమ్‌ఆద్మీ 1-3 సీట్లు గెలవచ్చని సర్వేలో తేలింది.
మోగిన ఎన్నికల నగారా..
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి