By: ABP Desam | Updated at : 12 Jul 2022 05:02 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
Rahul Gandhi Europe Visit: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన కింద ఆయన ఐరోపా వెళ్లినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 18న ప్రారంభం కానున్నాయి. ఇలాంటి కీలక సమావేశాల ముందు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంంతో మరోసారి చర్చ మొదలైంది.
ఆదివారం రిటర్న్
రాహుల్ గాంధీ ఆదివారం తిరిగి వస్తారని సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం ఈనెల 14న జరుగనుంది. రాహుల్ యూరప్ పర్యటన కారణంగా ఈ సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం లేదు.
కాంగ్రెస్ ఈనెల 14న జరిపే సమావేశంలో అక్టోబర్ 2 నుంచి ప్రారంభించనున్న యునైట్ ఇండియా క్యాంపెయిన్ 'భారత్ జోడో యాత్ర'కు సంబంధించిన ప్రణాళికలను కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి కూడా రాహుల్ గైర్హాజరవుతున్నారు.
రాహుల్ గాంధీ ఫారెన్ టూర్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు. కీలక సమావేశాలకు ఇలా గైర్హాజరవడం పార్టీ పనితీరుపై ప్రభావం చూపిస్తుందంటూ విమర్శిస్తున్నారు.
Rahul Gandhi's foreign trips
— Rishi Bagree (@rishibagree) July 12, 2022
✈ Location ➡ Secret
✈ Duration ➡ Secret
✈ Purpose ➡ Secret
✈ Funding ➡ Secret pic.twitter.com/fiq7ywm66b
రాష్ట్రపతి ఎన్నికలు
జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. జులై 21న కౌంటింగ్ నిర్వహించనున్నారు. జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2017 జులై 25న రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఈ ఏడాది జులై 24తో రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది.
ఎన్నిక ఇలా
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకోనుంది. ఎలక్టోరల్ కాలేజ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటర్లుగా ఉంటారు. ఎలక్టోరల్ కాలేజ్‌లో 4809 మంది సభ్యులు ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇందులో 4,120 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ 700 అని కమిషనర్ వెల్లడించారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల విలువ 10,98,903గా పేర్కొన్నారు. 5,34, 680 ఓట్ల విలువ పొందిన అభ్యర్థి విజయం సాధిస్తారని ఈసీ తెలిపింది.
Also Read: UK New PM Announcement: టీచర్స్‌డే రోజే ఇంగ్లాండ్ ప్రధాని ఎంపిక- రిషికే అవకాశాలెక్కువ!
Also Read: Red Alert For Maharashtra Rains: భారీ వర్షాలకు ముంబయి గజగజ- మరో 2 రోజుల పాటు అంతేగా అంతేగా!
Railway New Coaches : భారతీయ రైల్వేకు కొత్త బోగీలు, సౌకర్యాలతో పాటు స్పీడ్ పెరిగిందోచ్!
Raigad Suspicious Boat: సముద్రంలో కొట్టుకొచ్చిన AK-47ల పడవ- హోంశాఖ హై అలర్ట్!
Prashant Kishor:ఫెవికాల్తో సీఎం కుర్చీకి అతుక్కుపోయారు, బిహార్ సీఎం నితీశ్‌పై పీకే విమర్శలు
Jammu Kashmir Elections: స్థానికేతరులూ ఓటు వేయొచ్చు, కొత్తగా 25 లక్షల మందికి అవకాశం - కశ్మీర్ ఈసీ
YouTube Channels Blocked: ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేంద్రం వేటు, అసత్య ప్రచారాలు చేసినందుకే
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు