Red Alert For Maharashtra Rains: భారీ వర్షాలకు ముంబయి గజగజ- మరో 2 రోజుల పాటు అంతేగా అంతేగా!
Red Alert For Maharashtra Rains: ముంబయిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల ధాటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Red Alert For Maharashtra Rains: మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ముంబయి నీట మునిగింది. వర్షాల దెబ్బకు జనజీవనం స్తంభించిపోయింది. మంగళవారంతో పాటు బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) హెచ్చరించింది.
Why wfh is a necessity at least until we have alternate transportation options! #mumbailocals #mumbairains pic.twitter.com/graTi82DXK
— Pranjal Nandankar (@PranjalNandank2) July 11, 2022
జలదిగ్బంధం
మహారాష్ట్రలో భారీ వర్షాల దాటికి పలు జిల్లాల్లో నదులు, డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు ముంపు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ముంబయి మెట్రో కిక్కిరిసింది. ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గుజరాత్‌లో
#WATCH | Gujarat: Heavy rain causes a flood-like situation in Rajkot. Residents living in the lower reaches have been asked to remain alert. pic.twitter.com/TBg5SFG3Jm
— ANI (@ANI) July 12, 2022
#Cattle washed away and streets inundated in #Valsad, #Gujarat as heavy rains batter the district#HeavyRain #Rain pic.twitter.com/NSusRjrQLJ
— Himanshu dixit (@HimanshuDixitt) July 11, 2022
గుజరాత్‌లోని పలు జిల్లాల్లో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించింది. గుజరాత్‌లోని పలు నగరాల్లో వర్షాలు, వరదల ధాటికి మూగజీవాలు కూడా కొట్టుకుపోతున్నాయి.
కేరళలో
#WATCH | Locals try pulling out a jeep stuck on an inundated road in the wake of heavy rains in Kannur, Kerala pic.twitter.com/11YgYf14qF
— ANI (@ANI) July 12, 2022
కేరళలో కూడా వర్షాలు కుండపోతగా కురుస్తూనే ఉన్నాయి. వర్షాల ధాటికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
Also Read: Sri Lanka Crisis: దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్- శ్రీలంక అధ్యక్షుడి సోదరుడ్ని పట్టుకున్న అధికారులు!
Also Read: Supreme Court Judgments: సుప్రీం కోర్టు రికార్డ్- ఒకే రోజు 44 తీర్పులు, ఎప్పుడో తెలుసా?