By: ABP Desam | Updated at : 12 Jul 2022 01:49 PM (IST)
Edited By: Murali Krishna
సుప్రీం కోర్టు రికార్డ్- ఒకే రోజు 44 తీర్పులు, ఎప్పుడో తెలుసా?
Supreme Court Judgments: సుప్రీం కోర్టు ఓ రికార్డ్ సృష్టించింది. ఒకే రోజులో 44 తీర్పులిచ్చింది. ఇది ఇటీవలి కాలంలో అరుదైన రికార్డుగా పేర్కొంటున్నారు. వేసవి సెలవుల అనంతరం విచారణలు పునఃప్రారంభమైన జులై 11న ఈ ఘనత నమోదైంది.
20 ఆయనవే
ఈ 44 తీర్పుల్లో 20 తీర్పులను జస్టిస్ ఎంఆర్ షా ఇచ్చారు. క్రిమినల్ అపీళ్లు, సివిల్ వివాదాలు, బ్యాంకింగ్, నేరస్థుల అప్పగింత ఒప్పందాలు, దేశీయ చట్టాలు, వ్యాపార వివాదాలు, కోర్టు ధిక్కారం కేసులు, కాంట్రాక్టుల అమలు వంటి అంశాలకు సంబంధించిన కేసుల్లో ఈ తీర్పులు వచ్చాయి. మే 23 నుంచి జులై 10 వరకు అత్యున్నత న్యాయస్థానానికి వేసవి సెలవులు ఉన్నాయి.
పెండింగ్ కేసులు
మరోవైపు దేశంలో ప్రస్తుతం దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఔరంగాబాద్‌లోని మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఇటీవల ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా
భారత న్యాయవ్యవస్థ
" భారత న్యాయవ్యవస్థ నాణ్యత, గౌరవం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. నేను ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లాను. అక్కడ న్యాయవ్యవస్థకు చెందిన కొంతమందితో భేటీ అయ్యాను. వారికి కూడా భారత న్యాయవ్యవస్థపై మనలాంటి గౌరవమే ఉంది. మన సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులను అప్పుడప్పుడు యూకేలో కొన్ని కేసుల్లో రిఫర్ చేస్తారని వారు తెలిపారు. "
రిజుజు ఇలా అన్నారు.
Also Read: Nature Flaunting Tricolour: ప్రకృతి దిద్దిన మువ్వన్నెల జెండా- ఎగరాలి ప్రగతి పథానా, మన గగన జగానా!
Also Read: Bomb Hurled at RSS Office: RSS కార్యాలయంపై బాంబు దాడి- ఎవరు చేసి ఉంటారు?
US Visa: రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు- 3 నెలల్లో 90 వేల వీసాలు ఇచ్చిన అమెరికా
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Kerala: కేరళలో ఆర్మీ జవానుపై దుండగుల దాడి, తీవ్రంగా కొట్టి వీపుపై 'PFI' ముద్ర
Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?
C-295 MW: భారత వాయుసేనలోకి సీ-295 ఎండబ్ల్యూ తొలి విమానం
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>