Sri Lanka Crisis: దుబాయ్‌కు పారిపోవాలని ప్లాన్- శ్రీలంక అధ్యక్షుడి సోదరుడ్ని పట్టుకున్న అధికారులు!
Sri Lanka Crisis: దేశం విడిచి దుబాయ్‌కు పారిపోబోయిన శ్రీలంక అధ్యక్షుడి సోదరుడ్ని అధికారులు అడ్డుకున్నారు.
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడి సోదరుడు, మాజీ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సే దుబాయ్‌కి పారిపోయేందుకు యత్నించారు. అయితే విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
జనాలు చూసి
Basil Rajapaksa, Sri Lanka’s former finance minister was denied by passengers & immigration staff to leave the country for Dubai. Brother of Mahinda & Gotabaya also holds an American passport. pic.twitter.com/8PKpWMywAN
— Ashok Swain (@ashoswai) July 12, 2022
కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ టెర్మినల్ నుంచి దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు ఆయనను గుర్తించినట్లు సమాచారం. వెంటనే అధికారులకు తెలియజేయగా విమానాశ్రయంలోనే ఆయన్ను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
ఆందోళనలు
శ్రీలంకలో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇప్పటికే అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఆందోళనకారులు. దీంతో అధ్యక్ష పదవికి జులై 13న రాజీనామా చేస్తున్నట్లు గొటబాయ రాజపక్స ప్రకటించారు.
ప్రధాని రణిల్ విక్రమ సింఘే కూడా ఇప్పటికే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే అధ్యక్షుడు గొటబాయ నివాసంలో నిరసనకారులు భారీగా కరెన్సీ కట్లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
భారీగా నోట్ల కట్టలు
అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న నిరసనకారులకు అక్కడ భారీగా నోట్ల కట్టలు కనిపించినట్లు సమాచారం. నిరసనకారులు స్వాధీనం చేసుకున్న సొత్తును భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిపై దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.
భారత్ మాట
మరోవైపు శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. శ్రీలంకకు మద్దతు ఇస్తున్నామని, సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు భారత్ తన వంతు సాయం చేస్తుందన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీలంక సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. రాజకీయ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశం లభించిందని, ఇందుకోసం ప్రజలు తమకు సహకరించాలని శ్రీలంక సైన్యాధిపతి శవేంద్ర సిల్వా కోరారు.
Also Read: Supreme Court Judgments: సుప్రీం కోర్టు రికార్డ్- ఒకే రోజు 44 తీర్పులు, ఎప్పుడో తెలుసా?
Also Read: Sri Lanka Crisis: సైకిల్ ఎక్కిన శ్రీలంక! భారీగా పెరిగిపోయిన డిమాండ్!