అన్వేషించండి

YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

Jagan : చంద్రబాబు తెచ్చిన విపత్తు అని జగన్ విమర్శలు గుప్పించారు. తమ హయాంలో రైతుల్ని ఆదుకునేవారమని ఇప్పుడు వారు తీవ్రంగా నష్టపోయారన్నారు.

Jagan criticized Chandrababu for bringing disaster:  ఆంధ్రప్రదేశ్ లో తుపాను మొంథా చంద్రబాబు తెచ్చిన విపత్తు అని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. బుధవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన ఆయన గురువారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని  ఆవేదన వ్యక్తం చేశారు. 

పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుపాను వచ్చినందున దిగుబడులు బాగా  తగ్గిపోతాయన్నారు. నేలకొరిగిన పంట తిరిగి నిలబడటం కష్టమవుతుంది తెలిపారు.  25 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని జగన్ తెలిపారు.   11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం దాటిల్లిందని..  1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరు శనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలు దెబ్బతిన్నాయన్నారు. రైతులకు పార్టీ పరంగా  తోడుగా నిలబడాలని  వైఎస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.              

రైతులకు టీడీపీ ప్రభుత్వం సాయం చేయడం లేదన్నారు.  మన ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేది. ప్రతి పంటకూ ఇ-క్రాప్‌ చేసే వాళ్లమని గుర్తు చేశారు.  గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో  పని చేసి.. ఉచిత పంటలబీమాతో రైతులకు భరోసా ఉండేదన్నారు. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండటం వల్ల  70 లక్షల ఎకరాల పంట బీమా పరిధిలో ఉండేది. ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షలమందికి మాత్రమే బీమా అందుబాటులో ఉంది. మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలని జగన్ ప్రశ్నించారు.                        

చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన  16 నెలల్లో అల్పపీడనలు, వాయుగుండాలు, తుపాన్లు కారణంగా 16 వచ్చాయని జగన్ లెక్క చెప్పారు. ఎన్ని విపత్తులు వచ్చినా   రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ  ఇవ్వలేదన్నారు. నష్టపోయిన రైతులను  ఆదుకోలేదన్నారు.   ఏ రైతునూ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇ-క్రాప్‌ అందించిన పరిస్థితి కూడా లేదు. వాళ్లు వేసిన అరకొర లెక్కల ప్రకారమే 5.5 లక్షలమంది రైతులకు రూ.600 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మిర్చికి క్వింటాలుకు రూ.11,781కి కొనుగోలు చేస్తామన్నారు ఒక్క రూపాయికూడా రైతుకు ఇవ్వలేదు. పొగాకును కొనుగోలు చేస్తామ న్నారు దిక్కూ మొక్కూ లేదు. మామిడిని కిలో రూ.12లకు కొనుగోలు చేస్తామన్నారు. ఒక్క రైతు నుంచీ కొనుగోలు చేయలేదన్నారు. ఉల్లి రైతులకు  హెక్టారుకు  యాభై వేలు ఇస్తామన్నారు. అదికూడా ఇచ్చిన పాపాన పోలేదు.

 ఇ-క్రాప్‌ నీరుగార్చారని జగన్ అన్నారు.  వైసీపీ హయాంలో ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు రూ.7800 కోట్లు ఇన్సూరెన్స్‌ ఇప్పించగలిగాం. కాని ఇవాళ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది అని జగన్ విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలందరూ.. రైతులకు మేలు చేయాలని.. సాయం చేయాలని పిలుపునిచ్చారు.      

టాప్ హెడ్ లైన్స్

AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Smriti Mandhana Captaincy Era:  భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
భారత మహిళల క్రికెట్ కొత్త బాస్ గా స్మృతి మంధాన, ఆర్సీబీ డబుల్ ట్రోఫీ నాయకి చేతుల్లోకి పగ్గాలు
Leftover Rice Dosa : రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
రాత్రి అన్నం మిగిలిపోయిందా? పారేయకండి.. ఉదయాన్నే ఇలా దోశలు వేసుకోండి
Election Commission Powers: ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
ప్రధానమంత్రిపై చర్యలు తీసుకునే అధికారాలు ఈసీకి ఉన్నాయా?... ఎన్నికల సంఘం ప్రత్యేకతలు ఇవే!
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Honda తీసుకొచ్చిన 2 అడ్వెంచర్ బైక్స్ XR300L, XR300 Rally.. ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Indrakeeladari Arrangements: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు.. విజయవాడ ఉత్సవ్ కు తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. తమిళనాడు సీఎం విజయ్‌కు ఆహ్వానం
Embed widget