Sri Lanka Crisis: సైకిల్ ఎక్కిన శ్రీలంక! భారీగా పెరిగిపోయిన డిమాండ్!
Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రస్తుతం సైకిళ్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
Sri Lanka Crisis: శ్రీలంకలో రోజురోజుకు పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. దేశంలో ఇంధనం కొరత తీవ్రంగా ఉండడంతో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక పెట్రోలు కష్టాలు అంతా ఇంతా కాదు. రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలొకంది. దీంతో, పెట్రో బంక్‌ల దగ్గర భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.
The fuel crisis in Sri Lanka 🇱🇰 is making bicycles the most feasible commute. Many have been joining the protests by commuting on bicycles.
— Saad Hammadi (@saadhammadi) July 11, 2022
I wrote about the rise of a big cycling community in Bangladesh back in 2013. Time for Sri Lanka?#SriLankaCrisis
https://t.co/4F6MeSLuCs
ఫలితం లేదు
ఆటో డ్రైవర్లు తమ వాహనాల్లో ఎనిమిది లీటర్లు పెట్రోలు పోయించుకోడానికి రోజుల తరబడి క్యూలలో నిల్చుంటున్నారు. ఎనిమిది లీటర్లతో ఓ రెండు రోజులు గడుస్తుంది తర్వాత మళ్లీ క్యూ కట్టాల్సిందే. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఆహారం, వంట గ్యాస్, బట్టలు, రవాణా, విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
సైకిల్‌కే ఓటు
పెట్రోల్ దొరకకపోవడంతో దేశంలో సైకిళ్లకు డిమాండ్ పెరిగిపోయింది. మేం పెట్రోల్‌ను కొనుగోలు చేయలేము.. ఆ పెట్రోల్ కోసం క్యూలలో ఉండలేం, ఒక వేళ క్యూలైన్‌లో ఉన్నాపెట్రోల్ దొరుకుతుందన్న భరోసా లేదు అంటూ సైకిళ్లు కొనుగోలు చేస్తున్నామని పలువురు వ్యక్తులు చెబుతున్నారు.
సామాన్యుడు కొనలేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కులనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బయటకు బండి తీయాలంటేనే వణికిపోతున్న ప్రజలు.. వాహనాలకు బదులు సైకిళ్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది.
దుకాణాల్లో సైకిళ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వీటినే కొనుగోలు చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కూడా వీటిపైనే వెళ్తున్నారు. మరి శ్రీలంక వాసులకు ఈ బాధలు ఎప్పుడు తప్పుతాయో చూడాలి.
Also Read: India’s Oldest Tiger Died: దేశంలోనే అతిపెద్ద రాయల్ బెంగాల్ టైగర్ మృతి- 'మిస్ యూ రాజా'
Also Read: Viral Video: 'షూ' వేసుకునే ముందు ఒకసారి చెక్ చెయ్ బ్రో- ఇలా పాముంటే అంతే సంగతి!