Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
Baahubali The Epic Frist Review: 'బాహుబలి ది ఎపిక్' మూవీ ఫస్ట్ షోస్ ఓవర్సీస్‌లో ఇప్పటికే పడ్డాయి. తాజాగా మహేష్ బాబు కుమారుడు గౌతమ్ మూవీ చూసి అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు.

Mahesh Babu Son Gautham About Baahubali The Epic Movie : పాన్ ఇండియా మూవీ 'బాహుబలి' రెండు పార్టులు కలిపి ఒకే మూవీ 'బాహుబలి ది ఎపిక్'గా ఈ నెల 31న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా ఓవర్సీస్‌లో ఒక రోజు ముందే షోస్ పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ మూవీని చూసి ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
మూవీ ఎలా ఉందంటే?
'బాహుబలి ది ఎపిక్' అద్భుతంగా ఉందని గౌతమ్ తెలిపారు. ఇదివరకు ఎన్నడూ చూడని... ఎప్పటికీ చూడలేని బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించిందని చెప్పారు. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడో? అని తెలుసుకునేందుకు ఇప్పుడు రెండేళ్లు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రెండు పార్టులు కలిసి ఒకే మూవీగా ఎడిట్ చేసిన తర్వాత ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉంది.
తెలుగు సినిమాకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇంత ఆదరణ దక్కడం ఆనందంగా ఉంది. నేను ఈ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు రెండు భాగాలను ఒకేసారి చూడడం కొత్తగా ఉంది. నిజంగానే ఇది ఓ ఎపిక్. ప్రతీ సెకనుకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ ఎక్స్‌పీరియన్స్ మాటల్లో చెప్పలేను. అది ఒక క్రేజీ ఫీలింగ్. అంత అద్భుతంగా ఉంది.' అని రివ్యూ ఇచ్చారు.
Gautham Babu Shares His #BahubaliTheEpic
— Navyanth 💲 (@Navyanth_17) October 30, 2025
Experience 🩵pic.twitter.com/WMGb1fN1aH
Also Read : SSMB29... మహేష్ బాబు న్యూ లుక్ - రాజమౌళి సార్... ఆ రోజు కోసం వెయిటింగ్
SSMB29 అప్జేట్‌పై...
మహేష్ బాబు, రాజమౌళి మూవీ 'SSMB29'పై అప్టేడ్ గురించి అడగ్గా... దాని గురించి తనను అడగొద్దని గౌతమ్ తెలిపారు. మూవీ షూటింగ్ అవుతుందని... తనకేం తెలియదని సరదాగా కామెంట్ చేశారు.
ఇక 'బాహుబలి ది ఎపిక్' రన్ టైం 3 గంటల 43 నిమిషాలు కాగా... రెండు పార్టుల్లో కొన్ని సీన్స్, సాంగ్స్ కట్ చేసినట్లు దర్శక ధీరుడు రాజమౌళి తెలిపారు. కష్టమైన అవి కట్ చేయక తప్పలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. అవంతిక లవ్ స్టోరీతో పాటు, పచ్చబొట్టేసిన సాంగ్, ఇరుక్కుపో సాంగ్, కన్నా నిదురించిరా పాట, కాళకేయులతో యుద్ధానికి సంబంధించి కొన్ని సీన్స్ ట్రిమ్ చేశామని అన్నారు. కొత్త పార్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ సీన్ టు సీన్ అదే ఎమోషన్‌తో సాగుతుందని చెప్పారు.






















