Mahakali Movie Update : రౌద్ర రూపం... 'మహాకాళి' అవతారం - ఫస్ట్ లుక్ వేరే లెవల్
Mahakali First Look : ఇండియన్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ 'మహాకాళి' నుంచి బిగ్ సర్‌ప్రైజ్ వచ్చేసింది. మూవీలో మహాకాళి రోల్ ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ టీం పోస్టర్ రిలీజ్ చేసింది.

Bhoomi Shetty As Mahakali In Prasanth Varma Cinematic Universe : ఫస్ట్ మూవీ 'హనుమాన్'తోనే పాన్ ఇండియా లెవల్ సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో పవర్ ఫుల్ క్రేజీ ప్రాజెక్ట్ 'మహాకాళి' రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ గూస్ బంప్స్ క్రియేట్ చేశాయి. తాజాగా మూవీలో మహకాళి రోల్ పరిచయం చేస్తూ న్యూ లుక్ రివీల్ చేశారు మేకర్స్.
'మహాకాళి' అవతారం
రౌద్ర రూపంలో చెడును అంతం చేసే మహాశక్తి ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో అనేలా మహాకాళి లుక్ భయం గొల్పుతోంది. నల్లని రంగు ముఖం, ముక్కు పుడక, రుద్ర రూపం... మహా దేవతను కళ్లకు కట్టేలా ఉంది. భూమి శెట్టిని మహాకాళిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు మూవీ టీం వెల్లడించింది. 'సృష్టి విశ్వ గర్భం నుంచి విశ్వంలోని అత్యంత క్రూరమైన సూపర్ హీరో మేల్కొంటాడు. భూమిశెట్టిని 'మహా'గా పరిచయం చేస్తున్నాం.' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు.
View this post on Instagram
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తైనట్లు తెలుస్తుండగా... ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన గ్రాండ్ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. మహాకాళిగా ఇదివరకూ చూడని కొత్త ముఖాని ప్రెజెంట్ చేయడంతో ఆడియన్స్‌లో బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఇండియాలోనే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ హీరో మూవీ. బాలీవుడ్ హీరో అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
అనౌన్స్‌మెంట్ పోస్టర్ To ఫస్ట్ లుక్
ఈ మూవీని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్ సమర్పణలో రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్నారు. RKD స్టూడియోస్ ఈ ప్రాజెక్టుతోనే నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతోంది. ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, స్టోరీ అందిస్తుండగా... పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. డివోషనల్, పౌరాణిక బ్యాక్ డ్రాప్ అంశాలతో స్టోరీ గ్రిప్పింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బెంగాల్ సంస్కృతి బ్యాక్ డ్రాప్‌కు డివోషనల్ టచ్ ఇస్తూనే ఫెరోషియస్ సూపర్ హీరో మూవీని రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌తోనే భారీ హైప్ క్రియేట్ కాగా... తాజా లుక్‌తో అది పదింతలైంది.
ఓ అమ్మాయి తన తలను పులి నుదిటికి సున్నితంగా తాకినట్లు ఉండగా... గుడిసెలు, దుకాణాల ప్రజలు భయం, ఆందోళనతో పరుగులు తీస్తూ కనిపించారు. ఫెర్రిస్ వీల్ మంటల్లో ఉండగా... బెంగాళీ ఫాంట్‌లో డిజైన్ చేసిన టైటిల్ మధ్యలో డైమండ్ ఆకారం కనిపించడం వేరే లెవల్‌లో ఉంది. మూవీకి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా... పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ కానుంది.





















