సంక్రాంతికి విడుదల అయిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఏకంగా రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను ఈ సినిమా సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.150 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను ‘హనుమాన్’ కొల్లగొట్టింది. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నైజాం ప్రాంతంలో రూ.40 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. హిందీ వెర్షన్ కూడా రూ.50 కోట్ల వరకు మార్కెట్ చేసింది. ఏకంగా రూ.127.1 కోట్ల భారీ లాభాలను ‘హనుమాన్’ అందించింది. ఇటీవలి కాలంలో ఏ సినిమాకు ఇంత భారీ లాభాలు రాలేదు.