అన్వేషించండి

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించారు.

Telangana News: తెలంగాణలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ చట్టాన్ని రద్దు చేసి భూ భారతీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ధరణి అక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ చట్టం పేరుతో చేసిన కబ్జాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఫోరెన్సిక్‌ విచారణ చేస్తున్నట్టు సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

లక్షన్నర కోట్ల విలువైన భూముల గోల్ మాల్ 

 ‘ధరణి’ (Dharani)పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1 లక్షా 50 వేల కోట్ల విలువ చేసే భూములు చేతులు మారాయని  మంత్రి పొంగులేటి ఆరోపించారు. లిటిగేషన్‌లో ఉన్న భూములను పార్టీ-బీ‌ లో పెట్టి ఆ భూములను సక్రమం చేసుకున్నారని  దోచిన భూములను బీఆర్ఎస్  నేతలు తమ అస్మదీయులకు విచ్చలవిడిగా రిజిస్ట్రేషన్లు చేశారన్నారు.             

Also Read: తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

కొన్నిచోట్ల భూములకు యజమానులు ఇక్కడ లేరని .. దేశ విభజన సమయంలో పాకిస్తాన్  వెళ్లిపోయారని, అధికారులు నో అబ్జెక్షన్ అని  చెప్పారంటూ ఆ భూములను కూడా కాజేశారని పేర్కొన్నారు. ధరణి వల్ల అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన భూమి ముగ్గురు, నలుగురు వ్యక్తులు మీద మాత్రమే బదలాయింపు అయిందని ఆరోపించారు. ధరణి  పేరుతో నిరుపేదల ఆస్తులను కూడా కొల్లగొట్టారన్నారు.  

ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్డ్ భూముల బదలాయింపు                

అలాగే ధరణి వల్ల సుమారు 25 వేల ఎకరాల అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమయ్యాని ప్రభుత్వం భావిస్తోంది.  ఒక్క ఇబ్రహీంపట్నం పరిధిలోనే 10 వేల ఎకరాలు అన్యాక్రాంతం చేశారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అక్కడ ఎకరా రూ.10 కోట్ల విలువ ఉంటుందని న్యాక్రాంతమైన 25 వేల ఎకరాల భూముల మొత్తం విలువ రూ.2.50 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.                             

Also Read: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం

ప్రత్యేక సిట్ నియమించే అవకాశం                              

ధరణి మసుగులో జరిగిన భూ ఆక్రమనలన్నీ బయట పెడతామని, దీని వెనకాల ఎంత పెద్దవారున్నా వదిలే ప్రసక్తేలేదని ఇప్పటికే పలు సందర్భాలలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.  గత పదేళ్లలో చోటు చేసుకున్న భూ ఆక్రమణల మీద సమగ్ర విచారణ చేయడానికి సిట్‌   ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేయలేదు కానీ రేపో మాపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget