Bengaluru: బెంగళూరులో బిగ్గెస్ట్ స్కాం బయట పెట్టిన వ్యక్తి-వేల మందిదీ అదే మాట - ఆ స్కామేంటో తెలుసా ?
House Rent: బెంగళూరులో అతి పెద్ద స్కామ్ ఇదేనంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది . వేల మంది అవును నిజమేనని తాము కూడా బాధపడ్డామని అంటున్నారు. ఇంతకీ ఆ స్కామ్ ఏమిటంటే?
Biggest scam in Bengaluru man shares his experience House Rent: బెంగళూరులో నివాసం ఉండేవారు తమకు తెలియకుండానే వేలకు వేలు నష్టపోతున్నారు.ఇలాంటి ఓ స్కామ్‌ను ఓ వ్యక్తి బ యట పెట్టారు. వరుణ్ మయ్యా అనే వ్యక్తి బయట పెట్టిన ఈ స్కాం వివరాలు చూసి అందరూ నిజమే తాము కూడా ఇలా మోసపోయామని అనుకుంటున్నారు.
తాను బెంగళూరులో నివాసం ఉంటున్నానని ఇప్పటికి పది అద్దె ఇళ్లు మారానని.. ఇళ్లు మారిన ప్రతి సారి తాము ఇచ్చిన అడ్వాన్స్‌ను ఓనర్లు తిరిగి ఇవ్వడం లేదని అంటున్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్‌లో చెప్పారు.
the biggest scam in bangalore is when you are leaving an apartment and the owner sends you a fraction of the security deposit claiming “damage” or something despite no evidence. I’ve lived in maybe 10 apartments and this illegal retention of deposit has happened every single time
— Varun Mayya (@waitin4agi_) November 13, 2024
Also Read: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీ ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
వెంటనే అందరూ ఇదే మోసానికి తామూ గురయ్యామని అంటున్నారు. ఇళ్లు ఎంత నీట్ గా మెయిన్ టెయిన్ చేసి ఇచ్చినా ఏదోఓ డ్యామేజ్ అయిందని చెప్పి అడ్వాన్సులు తిరిగి ఇవ్వడం లేదంటున్నారు. ఎవరి అనుభవాలు వారు చెప్పుకున్నారు.
It's almost like a tradition there. Under the Karnataka Rent Control Act, landlords are supposed to give back the deposit within 30 days of you vacating the place...And if there's any deduction, they are legally required to provide itemized details of the damages or repairs.
— @shreedhar (@Shridhar_07) November 13, 2024
There's such a huge market opportunity for Rental companies to thrive in India, but the yields are so low it makes no financial sense. Dealing with a company is so much easier than dealing with the whims and fancies of individual landlords
— Sandeep Ramesh (@SandeepRamesh) November 14, 2024
Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
బెంగళూరులో ఇంటి రెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కు కనీసం ముఫ్పై వేలు పెట్టనిదే ఎవరూ ఇవ్వరు. ఇక అడ్వాన్సులు కూడా నాలుగైదు నెలల అద్దె కట్టించుకుంటారు. తీరా వేరే చోటకు మారాలనుకుంటే అక్కడ రెట్టింపు అడ్వాన్స్ కట్టాల్సి వస్తోంది కానీ ఇప్పు ఖాళీ చేస్తున్న ఓనర్లు మాత్రం అసలు అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదు. దీంతో నష్టపోతున్నారు. ఇలా రెంట్లకు ఉండే ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారని వరుణ్ అభిప్రాయం. ట్విట్టర్ లో రెస్పాన్స్ చూస్తే లాగే ఉంది మరి