Canada Khalistanis: కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
Canada : పాముకు పాలుపోస్తే ఎలా ఉంటుందో కెనడాకు మరోసారి అర్థం అవుతోంది. ఖలీస్థానీ సపోర్టర్లకు అండగా ఉంటున్న ఆ దేశ పాలకులకు గట్టి షాక్ తగిలింది. కెనడా మాదేనని వాళ్లు ర్యాలీలు ప్రారంభించారు.
We are owners of Canada Khalistanis: మన దేశంలో విభజన వాదాన్ని తమ గడ్డపై నుంచి ప్రోత్సహిస్తున్న కెనడాకు ఇప్పుడు తమ ఇంటికే నిప్పంటుకుందని అర్థమయ్యే పరిస్థితులు వచ్చాయి. ఖలీస్థానీ సపోర్టులు ఇప్పుడు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అదేమిటంటే కెనడా వాళ్లదేనట. మరీ కెనడా మాదే అక్కడ ఉంటున్న తెల్ల జాతీయులంతా యూరోప్‌కు..ఇజ్రాయిల్‌కు వెళ్లిపోవాలని అంటున్నారు. ఈ డిమాండ్‌తో ఖలీస్థానీలు నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన డిమాండ్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Khalistanis march around Surrey BC and claim “we are the owners of Canada” and “white people should go back to Europe and Israel”.
— Daniel Bordman (@DanielBordmanOG) November 13, 2024
How are we allowing these r*tards to shape our foreign policy? pic.twitter.com/9VmEnrVlGP
వియ్ ఆర్ ఓనర్స్ అఫ్ ది కెనడా పేరుతో వారు చేసిన నినాదాలు తెల్లజాతీయుల గుండెల్లో రైల్లు పరుగెత్తించడం ఖాయంగా కనిపిస్తోంది. కెనడాలో చాలా కాల క్రితం నుంచి సిక్కులు వెళ్లి స్థిరపడుతున్నారు. అక్కడ వారు పౌరసత్వం పొందుతున్నారు. అక్కడ వారి జనాబా బాగా పెరిగింది. ఆర్థిక వ్యవస్థలోనూ వారి పాత్ర కీలకం.అయితే వారిలో కొంత మంది అక్కడ ఉంటూ పంజాబ్ లో గ్యాంగ్ స్టర్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. వారు కొంత మంది ఖలిస్థానీ సపోర్టుర్లుగా మారారు. ప్రత్యేక ఖలిస్థాన్ ఏర్పాటు చేయాలంటూ కెనడా నుంచి వారు కుట్రలు చేస్తున్నారు. వారికి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడావు మాత్రం ఆ గ్రూపుకు సహకరిస్తున్నారు. భారత్ పై కుట్రలు చేసే వారికి మద్దతుగా ఉంటున్నారు.
Also Read; టెలిగ్రామ్ సీఈవో రియల్ విక్కీ డోనర్ - స్పెర్మ్ ఇచ్చి ఉచితంగా ఐవీఎఫ్ చేయిస్తాడట - ఒకటే కండిషన్
ఖలిస్థానీ సపోర్టర్ల పట్ల కెనడా ప్రధాని వైఖరితో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌లో పంజాబ్‌లో ఖలిస్థానీ తీవ్రవాదులు ఎవరూలేరు. ఉన్నదల్లా కెనడాలోనే . వారు ఇలా విభజన వాదాన్ని కోరుకుంటే.. వారు ఉన్న ప్రాంతాల్లోనే తర్వాత అదే పని చేస్తారని కొంత కాలంగా విశ్లేషమలు వస్తున్నాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తెల్లజాతీయుల్ని కెనడా నుంచి వెల్లిపోవాలని వారు అంటున్నారు. ఇది మెల్లగా ప్రారంభమైనా ఉద్ధృతంగా సాగుతుంది. దీని వల్ల కెనడా ప్రజలు అభద్రతా భావానికి గురి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఖలీస్థానీ సపోర్టర్లను భారత్ టెర్రరిస్టులుగా గుర్తిస్తుంది.
Also Read: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
నిజానికి ఖలీస్థానీ సపోర్టుర్లు ఎక్కువ మంది గ్యాంగ్ స్టర్లుగా ఉన్నారు. వారే సపోర్టు చేస్తున్నారు. ఇప్పుడు వారు కెనడానే తమ ఖలిస్తాన్ అనుకంటే..అక్కడ విభజన వాదం ప్రారంభమయినట్లు అవుతుంది. అంటే భారత్ పై చేయబోయిన కుట్రలో కెనడాలో భాగం అయి బలవుతోందన్నమాట.