Most Ordered Item On Swiggy: కండోమ్ కాదు బిర్యానీ కూడా కాదు - స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్ చేసే వస్తువు ఏదో తెలుసా ?
Swiggy: స్విగ్గీ ఇన్ స్టా మార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ చేసే వస్తువు ఏమిటో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కంపెనీ కో ఫౌండర్ శ్రీహర్ష మాజేటీ అసలు విషయం వెల్లడించారు. అదేమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
What Is The Most Ordered Item On Swiggy: స్విగ్గి ఫుడ్ డెలివరీతో పాటు ఇన్ స్టా మార్ట్ పేరుతో వస్తువుల్ని కూడా డెలివరీ చేస్తుది. పది నిమిషాల్లో డెలివరీ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. స్విగ్గీ ఫుడ్ యాప్‌లో అయితే ఎక్కువ మది బిర్యానీ ఆర్డర్ చేస్తారు. మరి ఇన్ స్టా మార్ట్‌లో ఏం ఆర్డర్ చేస్తారు. ఎక్కువ మంది కండోమ్స్ అనుకుంటారు. ఎందుకంటే షాప్‌కు వెళ్లి కండోమ్స్ కొనుగోలు చేస్తే ఎవరైనా చూస్తారని అనుకుంటారు. మొహమాటపడతారు. అందుకే ఏ ఇబ్బంది లేకుండా ఆర్డర్ పెట్టేయవచ్చని అనుకుంటారు. ఒక వేళ అది కాకపోతే ఇంట్లోకి అవసరమైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తారని అనుకుంటారు కానీ అసలు నిజం మాత్రం వేరే.
Also Read:కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !
స్విగ్గీ కో ఫౌండర్ మాజేటీ శ్రీహర్ష ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఎక్కువ మంది బెడ్ షీట్లు ఆర్డర్ చేస్తున్నారట. వాస్తవంగా అయితే తే వంటింటి సామాన్లు ఎక్కువగా బుక్ చేయాలి. కానీ.అసలు ఆర్డర్ డిమాండ్ చూస్తే.. దుప్పట్లకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తాము ఇన్ స్టా మార్ట్ లాంచ్ చేసిన మొదట్లో బ్యాటరీలకు ఎక్కువ డిమాండ్ ఉండేదని.. ఎక్కువ మంది ఆర్డర్ చేసేవారని ఇప్పుడు.. బెడ్ షీట్లను ఎక్కువ ఆర్డర్ చేస్తున్నారని అంటున్నారు. పది నిమిషాల్లో బెడ్ షీట్లు కావాలని ఆన్ లైన్ షాపర్స్ ఎందుకు కోరుకుంటున్నారన్నది సస్పెన్స్‌గా మారింది.
స్విగ్గి తాజాగా ఐపీవోకి వచ్చి రూ. లక్ష కోట్ల విలువైన కంపెనీగా మారింది. ఆగస్ట్ 6వ తేదీ, 2014 లో స్విగ్గీని ప్రారంభించారు. తొలిరోజు తమకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని కో ఫౌండర్ శ్రీహర్ష మాజేటి చెప్పారు. అంటే ఒక్క ఆర్డర్ కూడా లేని పరిస్థితి నుంచి పదేళ్లలో లక్ష కోట్ల విలువైన కంపెనీగా ఎదిగారన్నమాట. ఇవాళ 3,00,000 రెస్టారెంట్లతో స్విగ్గీ భాగస్వామ్యం కలిగి ఉంది. నిమిషానికి కొన్ని వేల ఆర్డర్లు పొందుతోంది. కొన్ని వేల మంది డెలివరీ బాయ్స్ ఉపాధి పొందుతున్నారు. మరింత విస్తృతమైన సేవలు అందించేందుకు ఐపీవోతో వచ్చింది.
Also Read: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
షేర్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఓ వైపు మార్కెట్లు భీకర నష్టాల్లో నడుస్తున్నా.. మదుపరులు మాత్రం ఈ కంపెనీ షేర్లను ఎగబడి కొనేశారు. దీంతో తొలిరోజే షేర్ విలువ దాదాపు 17 శాతం పెరిగింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర కన్నా 5.64 శాతం ఎగిసి రూ.412 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 7.69 శాతం ఎగబాకి రూ.420 వద్ద లిస్టింగైంది. చివరకు బీఎస్‌ఈలో పుంజుకొని రూ.456 వద్ద ముగిసింది. స్విగ్గీ ఇష్యూ ధర రూ.390గా ఉన్నది. ఇక బంపర్ సక్సెస్‌తో కంపెనీ మార్కెట్ విలువ లక్ష కోట్లు దాటింది. మరో వైపు ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ కింద అర్హులైన ఉద్యోగులకు స్విగ్గీ కేటాయించిన షేర్ల విలువ ఇప్పుడు భారీగా పెరగడంతో వారంతా కోటీశ్వరులైయ్యారు.