Ministry of Sex: రష్యాలో శృంగార శాఖ- రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, హోటళ్లలో గడిపే జంటలకు మనీ ఆఫర్
Russia Ministry of Sex | త్వరలో రష్యాలో శృంగార శాఖ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. దేశంలో జననాల రేటు పెంచేందుకు రాత్రి 10 తర్వాత కరెంట్ కట్, ఇంటర్నెట్ బంద్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Declining Birth Rates in Russia | మాస్కో: గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో జననాల రేటు తగ్గిపోయింది. యువత పెళ్లి మీద ఆసక్తి చూపడం లేదని గుర్తించిన రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శృంగార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓకే చెబితే మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన విడుదల కానుంది.
జననాల రేటు పెంచేందుకు కరెంట్ కట్, ఇంటర్నెట్ బంద్
ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 600,000 మంది రష్యన్ సైనికులు అమరులు కావడంతో దేశంలో జనాభా సంక్షోభం పెరిగింది. అసలే యువత పెళ్లి, పిల్లల్ని కనడంపై ఆసక్తి చూపడం లేదు. 1999 తరువాత ఏడాదిలో తొలి 6 నెలల్లో జననాల రేటు తొలిసారి పడిపోయింది. జననాల రేటు గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోవడంతో రష్యా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాత్రిపూట కరెంట్ కట్ చేయడం, యువత, మధ్య వయస్కులు ఎంతగానో అడిక్ట్ అయిన ఇంటర్నెట్ ఆ సమయంలో నిలిపివేస్తే భార్యభర్తల మధ్య సాన్నిహిత్యం పెరిగి జననాల రేటుకు దోహదం చేస్తుందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది.
మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ఏర్పాటుకు పెరిగిన డిమాండ్
దేశంలో క్రమంగా పడిపోతున్న జననాల రేటును పెంచాలన్నా, జనాభా పెరుగుదలకు తీసుకునే చర్యల్లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ఏర్పాటు చేయాలని అధికారులు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సూచించారు. ప్రభుత్వం సైతం ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 2 వరకు విద్యుత్ నిలిపివేయడం, ఇంటర్నెట్ సేవలు సైతం కట్ చేస్తే దంపతులు సాన్నిహితంగా మెలగడం ద్వారా జననాల రేటు పెరుగుతుందని రష్యా అధికారులు పుతిన్ కు వివరించారు.
ఇంట్లోనే ఉండే స్త్రీలకు కనీస వేతనం ఇవ్వాలని సైతం రష్యా ప్రభుత్వం యోచిస్తోంది. కొత్తగా పెళ్లయిన జంటలకు హోటల్ ఖర్చుల్లో ఎంతో కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయడం, డేటింగ్ ప్రోత్సహించడం లాంటి విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. రష్యా ప్రభుత్వ మహిళా ఉద్యోగినులను అడిగి, వారి సలహాలు, సూచనలు తీసుకుంటోంది.
Also Read: Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్‌గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
సన్ న్యూస్ యొక్క నివేదిక ప్రకారం, తొలిసారి డేటింగ్ కు వెళ్లేవారికి 40 పౌండ్లు, కొత్త జంటలు హోటళ్లలో స్టే చేసే వారికి 208 పౌండ్ల వరకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ ద్వారా పబ్లిక్ ఫండింగ్ చేయాలని తద్వారా జననాల రేటు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పిల్లలను కనడాన్ని ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఖబరోవ్స్క్‌లో 18 నుంచి 23 ఏళ్ల వయస్సు గల ఫిమేల్ స్టూడెంట్స్ కు బిడ్డ పుడితే 900 పౌండ్లు, మొదటి బిడ్డ పుడితే విద్యార్థులకు చెల్యాబిన్స్క్ 8,500 పౌండ్లు అందజేస్తుంది. పనిలో చాలా బిజీగా ఉండటం కారణం కాదని, ఇతర కారణాలతో లైంగిక చర్యలకు దూరంగా ఉంటున్నారని అధికారులు చెబుతున్నారు.