Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్‌గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
From Negative to Positive : కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావం వల్ల ఎక్కువగా నెగిటివిటీ ఫేస్ చేస్తూ ఉంటాము. ఆ సమయంలో పాజిటివ్‌గా ఉండేందుకు ఈ సూచనలు ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.
Staying Positive When Life Gets Tough : మనం ఎంత నెగిటివ్ ఆలోచనలతో ఉంటే.. మన పరిస్థితులు అంత దిగజారిపోతాయట. సరైన నిర్ణయాలు తీసుకోలేమట. ముఖ్యంగా చేసే పనిలో సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు పరిస్థితులు ప్రభావం వల్ల, ఒత్తిడివల్ల పాజిటివ్‌గా ఆలోచించడమే మానేస్తూ ఉంటాము. తెలియకుండా నెగిటివ్ ఆలోచనలు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన మైండ్‌ని పాజిటివ్‌గా ఉంచేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏమిటంటే.. పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాము. మంచి ఫలితాలు ఉంటాయి. నెగిటివ్‌గా ఆలోచించినా.. అలాంటి పనులు చేసినా.. ఫలితాలు మంచిగా వచ్చినా.. దాని చెడు ప్రభావం కూడా వెంట వస్తుందని చెప్తున్నారు. అందుకే.. నెగిటివ్ ఆలోచనల జోలికి వెళ్లొద్దని చెప్తున్నారు. పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటామని చెప్తున్నారు.
ఫాలో అవ్వాల్సిన టిప్స్..
మీ జీవితంలో కొత్తరోజు వచ్చిందంటే మీరు కచ్చితంగా గ్రాటీట్యూడ్తో ఉండాలి. మీకు దాటి వచ్చిన ప్రతి రోజుకి థాంక్‌ఫుల్‌గా ఉండాలి. మీ ఆలోచనలు కరెక్టో కాదో.. మీతో మీరు సంభాషించుకుంటే తెలిసిపోతుంది. సెల్ఫ్ టాక్‌కి టైమ్ ఇచ్చుకోండి. దీనివల్ల మీ ఆలోచనల్లో నెగిటివ్ ఉంటే.. దానిని పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. సమస్యలను చూసి భయపడడం కాకుండా.. దానిని ఎలా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించాలి. పరిస్థితులు ఎంత మిమ్మల్ని డౌన్ చేస్తున్నా.. మంచి జరుగుతుందని నమ్మాలి.
రోజూవారి అలవాట్లు
నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఉదయాన్నే మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉండి.. పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. రెగ్యూలర్‌గా వ్యాయామం చేస్తూ ఉంటే.. కొత్త శక్తి వస్తుంది. ఇది మీ మూడ్‌ని సెట్ చేసి.. నెగిటివ్ ఆలోచనలు దూరం చేస్తుంది. ప్రకృతితో మమేకమైతూ ఉంటే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి పార్క్‌కు లేదా అలా బయటకు వెళ్లండి.
నిందించుకోకండి..
ప్రతి మనిషి తప్పులు చేస్తాడు. మీ వల్ల కూడా తెలిసో.. తెలియక తప్పు జరిగే ఉంటాది. దాని గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు నిందించుకోకండి. చేసిన తప్పు మళ్లీ చేయొద్దనుకుంటూ.. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లండి. నిందించుకోవడానికి బదులు.. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించండి. చేసే పనిపై ఫోకస్ ఉంచండి. సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ పని చేసేప్పుడు వాటి గురించి ఆలోచించకండి. సక్సెస్ అయినా, సంతోషం వచ్చినా ఆ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకోండి.
వాటి గుర్తించండి..
మీరు ఏ విషయాలకు ఎక్కువగా నెగిటివ్‌గా ట్రిగర్ అవుతున్నారో గుర్తించండి. వాటికి దూరంగా ఉండండి. నిజాలు ఏంటో తెలుసుకోండి. అంతేకాని.. ఇలా అయి ఉండొచ్చని ఊహించుకుని సమస్యలను పెంచుకోకండి. క్లారిటీ లేనప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది. శారీరకంగా ఫిట్‌గా ఉండాలని గుర్తించుకోండి. మీ శరీరానికి, మనసుకు మంచిని చేసే పనులు చేయండి. మీ ఫ్రెండ్ లేదా ఫ్యామిలీమెంబర్తో టైమ్‌ని స్పెండ్ చేయండి. ఇది కూడా మీకు నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది.
Also Read : స్నానానికి ముందు నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా? ముఖ్యంగా మహిళలకు