Ghee Navel Application : స్నానానికి ముందు నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. ఇన్ని ప్రయోజనాలా? ముఖ్యంగా మహిళలకు
Ghee Benefits : నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. కానీ దానిని తీసుకోవడం కొందరికి ఇష్టముండదు. అలాంటివారు నాభికి నెయ్యిని అప్లై చేయవచ్చు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Applying Ghee to the Navel : స్నానం చేసే ముందు ఒంటికి నూనె రాసి.. నలుగు పెట్టుకోవడమనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఆ ఆచారం దాదాపుగా పోయింది. అంత టైమ్ కూడా ఎవరికీ ఉండట్లేదు. అయితే.. ఓ సింపుల్ చిట్కాతో.. ఆరోగ్యానికి, అందానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. స్నానం చేసే ముందు నాభికి నెయ్యి రాస్తే చాలట. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయంటున్నారు.
అవును మీరు విన్నది నిజమే. బొడ్డు మీద నెయ్యి అప్లై చేస్తే స్కిన్‌కి, ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ అందుతాయట. మానసికంగా కూడా కొన్ని ప్రయోజనాలు పొందవచ్చని చెప్తున్నారు. మరి నాభికి నెయ్యిని ఎలా అప్లై చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మానికి..
నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. చర్మం పొడిబారడం తగ్గుతుంది. నెయ్యి చర్మాన్ని మృదువుగా, మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడి చర్మాన్ని దూరం చేస్తుంది. స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేసి.. ఇరిటేషన్‌తో పాటు వాపును తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలలో కూడా మంచి మార్పులుంటాయి.
జీర్ణశయానికి..
నెయ్యిని బొడ్డుపై అప్లై చేయడం వల్ల మెరుగైన జీర్ణక్రియ మీ సొంతమవుతుంది. అలాగే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. దీనిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు గాయలను త్వరగా తగ్గిస్తాయి.
మానసిక ప్రయోజనాలివే..
నెయ్యిని నాభికి అప్లై చేస్తే.. మీలో పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుందట. అలాగే.. ఒత్తిడి, యాంగ్జైటీ తగ్గుతుందని చెప్తున్నారు. అన్నివేళలా పాజిటివ్‌గా ఉండడంలో హెల్ప్ అవుతుంది. ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌గా ఉంటారు.
ఆయుర్వేదంలో ఇది ఆధ్యాత్మికతకు గుర్తుగా చెప్తారు. నాభి అనేది శరీరంలోని ఆత్మకు కనెక్ట్ అయి ఉంటుందంటారు. నాభికి నెయ్యి అప్లై చేయడం వల్ల ఆత్మకు అభిషేకం చేసినట్టేనని భావిస్తారు.
మహిళలకు మరిన్ని ప్రయోజనాలు..
పీరియడ్స్ సమయంలో ఉన్నప్పుడు నాభికి నెయ్యి అప్లై చేయడం వల్ల క్రాంప్స్ వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. ఫెర్టిలిటీ సమస్యలపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు దీనిలో నెయ్యిలో ఉన్నాయి.
ఎలా అప్లైచేయాలంటే..
తక్కువ మోతాదులో నెయ్యి తీసుకుని దానిని వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది. దానిలోని రెండు మూడు చుక్కలను తీసుకుని నాభిపై అప్లై చేయాలి. సున్నితంగా చర్మంలోపలికి వెళ్లేలా మసాజ్ చేయాలి. స్నానం చేసే పావుగంట ముందు రాస్తే మంచిది. అరగంట సేపు కూడా ఉంచుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్వచ్ఛమైన, క్వాలిటీ నెయ్యిని ఉపయోగించాలి. నాభి దగ్గర గాయాలున్నా.. సెన్సిటివ్ స్కిన్ ఉన్నా.. మీరు దానిని రాసుకోకపోవడమే మంచిది. ఈ ప్రొసెస్‌ను ఫాలో అవ్వాలనుకుంటే కచ్చితంగా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవన్నీ ఆయుర్వేదంలో కలిగే లాభాలే అంటారు. సైంటిఫిక్‌గా ఎలాంటి రుజువులు లేవు.
Also Read : కార్తీకమాసంలో వారు ఉపవాసం చేయకపోవడమే మంచిదట, కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

