(Source: ECI/ABP News/ABP Majha)
AIADMK GC Meet: అన్నాడీఎంకేకు షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్, ఆ మీటింగ్ చెల్లదని వ్యాఖ్యలు
AIADMK GC Meet: జులై 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సమావేశం చెల్లదని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.
మీటింగ్ నిర్వహించే అవకాశం వారికే ఉంటుంది : హైకోర్ట్
అన్నా డీఎంకే పార్టీకి మద్రాస్ హైకోర్ట్ షాక్ ఇచ్చింది. జులై 11వ తేదీన జరిగిన జనరల్ కౌన్సిల్ మీటింగ్ చెల్లదని, మరోసారి ఈ సమావేశం నిర్వహించాలని తేల్చి చెప్పింది. కో ఆర్డినేటర్, జాయింట్ కో ఆర్డినేటర్‌కు మాత్రమే జనరల్ కౌన్సిల్ నిర్వహించే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వమ్ వేసిన పిటిషన్‌పై చేపట్టిన విచారణలో భాగంగా..ఈ వ్యాఖ్యలు చేసింది. తనను పార్టీ నుంచి బహిష్కరించటమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా జనరల్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించటాన్ని హైకోర్ట్‌లో సవాలు చేశారు పన్నీర్‌సెల్వం. జులై 11వ తేదీన జరిగిన ఈ సమావేశంలో...పన్నీర్‌సెల్వంని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించటంతో పాటు, ట్రెజరర్ పోస్ట్ నుంచి కూడా తప్పిస్తున్నట్టు తీర్మానం పాస్ చేశారు. ఆయన స్థానంలో పళనిస్వామి AIDMK తాత్కాలిక జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. ఈ నిర్ణయం తరవాత తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి. ఈ అల్లర్ల కారణంగా...పార్టీ హెడ్‌క్వార్టర్స్‌ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మూసేశారు.
Tamil Nadu | Madras High Court orders in favour of O Panneerselvam. Orders status quo ante June 23, also orders conduct of a fresh general council meet of AIADMK.
— ANI (@ANI) August 17, 2022
O Paneerselvam had questioned the legality and violation of bylaws in convening the AIADMK General Council meeting pic.twitter.com/8mlRRemAm9
చాలా రోజులుగా విభేదాలు..
పార్టీ హెడ్‌క్వార్టర్స్ తాళాన్ని తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామికి అప్పగించాలని జస్టిస్ జి జయచంద్రన్ ధర్మాసనం ఆదేశించింది. అదే విధంగా..ఎలాంటి అల్లర్లు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయాలని చెప్పింది. పన్నీర్ సెల్వం పిటిషన్‌ను స్వీకరించి, మూడు వారాల్లోగా తీర్పునివ్వాలని సుప్రీం కోర్టు, మద్రాస్ హైకోర్ట్‌కు సూచించింది. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. జూన్‌లో జరిగిన సమావేశంలో..పార్టీ సమన్వయకర్త పన్నీర్ సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు మాజీ సీఎం పళనిస్వామి వర్గీయులు. పార్టీలో ఏక నాయకత్వం కావాలన్న డిమాండ్‌పై ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చెన్నైలోని వెంకట చలపతి ప్యాలెస్‌లో అన్నాడీఎంకే నేతల మధ్య కీలక సమావేశం జరిగింది.
పార్టీని చేజిక్కించుకునేందుకు సీనియర్ నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేశారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలలో ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలని నిర్ణయించడంతో ఎక్కువ మంది పళనిస్వామి వైపే మొగ్గు చూపారు. దీంతో సమావేశం మధ్యలోనే పన్నీర్ సెల్వం తన మద్దతు దారులతో వాకౌట్ చేశారు.అయితే వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయే సమయంలో పళనిస్వామి వర్గానికి చెందిన కొందరు పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన వైపునకు నీళ్ల సీసాలు విసిరారు. బయట పన్నీర్ సెల్వం కారు టైర్లో గాలి కూడా తీసేశారు. ఈ గందరగోళం తరవాతే...జులై 11న మరోసారి మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇది కూడా చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పు పన్నీర్‌సెల్వంకి కాస్త ఊరటనిచ్చినా...ఆ తరవాత ఏం జరగనుందన్నగే ఉత్కంఠగా మారింది.
Also Read: Salary Hike: గుడ్ న్యూస్! 2023లో ఉద్యోగుల వేతనాల్లో బంపర్ పెరుగుదల!
Also Read:Poorna: అప్పుడే అరవిరిసిన ముద్ద మందారంలా పరికిణిలో మెరిసిపోతున్న పూర్ణ
Poorna: అప్పుడే అరవిరిసిన ముద్ద మందారంలా పరికిణిలో మెరిసిపోతున్న పూర్ణ