అన్వేషించండి

Samsung and LG Cases: మోడీ ప్రభుత్వంపై సామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీల కేసులు, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్‌పై వివాదం

Samsung and LG Cases: ఎలక్ట్రానిక్-వ్యర్థాల రీసైక్లింగ్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా LG, Samsung గళం విప్పాయి. భారత ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధపడ్డాయి.

E-Waste Management: ఎలక్ట్రానిక్-వ్యర్థాల రీసైక్లర్లకు చెల్లింపులను పెంచే విధానాన్ని రద్దు చేయాలని దక్షిణ కొరియా కంపెనీలు LG, Samsung భారత ప్రభుత్వంపై పిటిషన్ వేశాయి. దీని వ్యాపారం నిర్వహణపై పెను ప్రభావాన్ని చూపుతోందని అనేక ఇతర పెద్ద కంపెనీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయని  భారతదేశ పర్యావరణ రూల్స్‌ను సవాలు చేశాయి. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై విదేశీ కంపెనీలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం మధ్య పెరుగుతున్న వివాదానికి ఈ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. దీనిపై కీలకమైన ప్రశ్నలను రాయిటర్స్  సందించింది. ఈ ప్రశ్నలకు రెండు కంపెనీలు ఇంకా స్పందించలేదు. ఇటు భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఎటువంటి ప్రతిస్పందన ఇవ్వలేదు.

ఈ కంపెనీలు కూడా మోడీ ప్రభుత్వంపై పిటిషన్ వేశాయి
చైనా, US తర్వాత భారతదేశం మూడో అతిపెద్ద ఈ-వ్యర్థాల ఉత్పత్తిదారుగా ఉంటోంది. కానీ గత సంవత్సరం దేశంలోని ఈ-వ్యర్థాలలో 43 శాతం మాత్రమే రీసైకిల్ అయినట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈ రంగంలో 80 శాతం అనధికారిక స్క్రాప్ డీలర్లు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. వాళ్లు చేస్తున్న రీసైక్లింగ్ పద్ధతులు పర్యావరణానికి ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

డైకిన్, భారతదేశానికి చెందిన హావెల్స్, టాటా వోల్టాస్ ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై పిటిషన్లు వేశాయి. కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఇతర ఉపకరణాలను రీసైకిల్ చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది, అయితే కంపెనీలు అధిక అనవసరమైన ఖర్చుగా చెబుతున్నాయి. 

ప్రభుత్వం కనీస చెల్లింపును ఎందుకు నిర్ణయించింది?
రీసైక్లర్లకు కనీస ఛార్జ్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా Samsung , LG లాబీయింగ్ చేశాయి. అయితే ప్రభుత్వం ఈ-వేస్ట్ రీసైక్లింగ్‌లో పెట్టుబడులను ప్రోత్సహించడం , ఈ రంగంలోకి మరింత అధికారిక డీలర్లను తీసుకురావడం అవసరమని చెబుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అనధికారిక వ్యర్థాల రీసైక్లింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. ఈ పనిలో రీసైక్లర్లు పార్టులను తొలగించిన తర్వాత వ్యర్థాలను బహిరంగంగా కాల్చివేస్తున్నారు. లేదా యాసిడ్ లీచింగ్ వంటి పద్ధతులను అవలంబిస్తారు, ఇది పర్యావరణానికి ప్రమాదకరం.

ప్రభుత్వ కొత్త నిబంధనలతో కంపెనీలకు ఇబ్బంది 
న్యూఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన LG కీలక కామెంట్స్ చేసింది. రీసైక్లర్లకు కనీస మొత్తాన్ని చెల్లించాలన్న నియమం ద్వారా ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాన్ని సాధించలేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని పేర్కొంది, 'కాలుష్య కారకాల చెల్లింపు' పేరుతో పన్ను విధించడం ద్వారా కంపెనీలను దోచుకోవడమేనని తెలిపింది. ప్రభుత్వం అనధికారిక రీసైక్లర్లను ఈ నిబంధన పరిధిలోకి తీసుకురాలేకపోతే అది పరిపాలన వైఫల్యమేనని కూడా అభిప్రాయపడింది. 

ధర నిర్ణయించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలు సాధించే వీలు లేదని శామ్సంగ్ తన పిటిషన్‌లో పేర్కొంది. దీనికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి కిలోకు కనీసం రూ. 22 , స్మార్ట్‌ఫోన్‌లకు కిలోకు రూ. 34 చెల్లించడం తప్పనిసరి అవుతుందని ఇది భారంగా మారుతుందని తెలిపింది. 

స్మార్ట్‌ఫోన్‌ల వంటి తేలికైన గాడ్జెట్‌లతో పోలిస్తే యూనిట్‌కు రీసైక్లింగ్ ఖర్చు గణనీయంగా పెరిగినందున ఇది ఎయిర్ కండిషనర్ తయారీదారులపై ఎక్కువగా ప్రభావితం అవుతుంది. అమెరికాతో పోలిస్తే భారతదేశ రీసైక్లింగ్ రేట్లు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయని పరిశోధనా సంస్థ రెడ్‌సీర్ ఫిబ్రవరిలో తెలిపింది. అమెరికాలో, అవి ఐదు రెట్లు ఎక్కువ, చైనాలో కనీసం 1.5 రెట్లు ఎక్కువ అని వెల్లడించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Elections 2026 : కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
కరూర్ తొక్కిసలాట తర్వాత జరిగిన మొదటి ర్యాలీలో పాల్గొన్న విజయ్! DMK దుష్ట శక్తి అంటూ కామెంట్స్
Business Reformer of the Year 2025: బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ చంద్రబాబు - అభినందించిన మంత్రులు, అధికారులు
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Avatar 3 : బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
బాహుబలి, అఖండ, రుద్ర, సలార్‌లతో అవతార్ సెల్ఫీ దిగితే - ఇది మరో విజువల్ వండర్
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Embed widget