Viral News: కొడుకు, కోడలికి లడ్డూ ఇచ్చిన తల్లి - కాకపోతే విషం కలిపేసింది - ఆస్తి కోసం కన్నకొడుకు చంపేసిన అమ్మ !
Crime News: ఆగ్రాలో ఆస్తి కోసం కుమారుడికి విషం ఇచ్చి చంపింది తల్లి. నవమాసాలు మోసిన కుమారుడ్ని ఆస్తి వివాదంలో ప్రాణం తీసింది.

Agra Crime News: అమ్మ అంటే ప్రాణం పోస్తుంది. జీవితం ఇస్తుంది. కానీ ప్రాణం తీస్తుందని ఊహించగలరా?. అసలు అలాంటి ఆలోచనఎ తల్లీకి రాదు. కానీ నూటికో కోటికో ఒకరికి వస్తుంది. ఆ అమ్మ కడుపున పుట్టిన బిడ్డ ఆ అమ్మ చేతిలోనే ప్రాణం పోగొట్టుకుంటాడు. ఈ ఆగ్రాయువకుడి పరిస్థితి కూడా అంతే. భార్యతో సహా తల్లి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు.
ఆగ్రాలో ఏప్రిల్ 17వ తేదీన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులుకు సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి భార్యాభర్తలు మంచం మీద అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారి చిన్నారి కుమార్తె సమీపంలో కూర్చుని ఏడుస్తోంది. పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న భార్యాభర్తలను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరూ చనిపోయినట్లు వైద్యుడు ధృవీకరించాడు. భార్యాభర్తల మృతదేహాలు పడి ఉన్న ప్రదేశంలో లడ్డూ కూడా పడి ఉంది. కాబట్టి ప్రాథమికంగా చూస్తే ఇది భార్యాభర్తల ఆత్మహత్య కేసుగా కనిపించింది. పోలీసులు కూడా అలాగే నమోదు చేసుకున్నారు.
కానీ అసలు ట్విస్ట్ తర్వాత వెలుగు చూసింది. ఆత్మహత్య అయినప్పటికీ పోలీసులు తమ విధుల్లో భాగంగా ఆధారాలు సేకరించారు. పోలీసులు సంఘటన స్థలం నుండి ఆధారాలను సేకరించిన సమయంలో వారు లడ్డూలో విషం కలుపుకున్నట్లుగా లేదని.. విషం కలిపిన లడ్డూను తిన్నట్లుగా ఉందని అనుమానించారు. లోతైన దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోలీసులు బంధువులు మరియు సమీపంలోని వ్యక్తులను కూడా విచారించారు, ఆ తర్వాత కుటుంబ వివాదం విషయం వెలుగులోకి వచ్చింది.
వారు కుటంబంలో ఆస్తి గొడవలు ఉన్నట్లుగా స్థానికులు చెప్రారు. దీంతో పోలీసులు ఓ కోణంలో వివరాలు రాబట్టారు. ఆస్తి విభజన విషయంలో తల్లి, సోదరుడు , వదిన, కొడుకు , కోడలి మధ్య వివాదాలున్నాయి. దీంతో కొడుకు, కోడలిని చంపాలని తల్లి , సోదరుడు, వదిన నిర్ణయించుకున్నారు. అలా చంపితేనే ఆస్తి ఎక్కువ భాగం తమకు వస్తుందని అనుకున్నారు. కన్న కొడుకన్న విచక్షణ కూడా మరిచి కొడుకు, కోడలిని లడ్డూల్లో విషం కలిపి చంపేశారు. ఆస్తి విభజన సంబంధాలను చంపుకునేంతగా మారిపోయారు. పోలీసుల విచారణలో కుటుంబం తమ నేరాన్ని అంగీకరించింది. పోలీసులు వారిని ఠఅరెస్టు చేశారు.
ఆగ్రా డీసీపీ సిటీ సోనమ్ కుమార్ మొత్తం విషయాన్ని వెల్లడించారు. భార్యాభర్తల ఆత్మహత్య గురించి సమాచారం అందిందని దర్యాప్తు తర్వాత వారిద్దరినీ లడ్డూల్లో విషం కలిపి హత్య చేసినట్లు తేలింది. ఈ కేసులో మృతుడి తల్లి, సోదరుడు, సోదరుడి భార్య, తమ్ముడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆగ్రాలో కలకలం రేపింది. ఎంతో ప్రేమగా పిలిచి తల్లి ఇచ్చిన లడ్డూను ఆ కుమారుడు తిన్నాడు. తనను తల్లి చంపేస్తుందని ఏ మాత్రం ఊహించలేకపోయాడు. కానీ.. తల్లిని కూడా నమ్మి చనిపోయాడు.





















