అన్వేషించండి

waqf Bill : వక్ఫ్ చట్టం వల్ల ఎన్నో ప్రయోజనాలు - ముస్లిం వర్గాలు అర్థం చేసుకోలేకపోతున్నాయా ?

Waqf News: వక్ఫ్ బిల్లు వల్ల అనేక ప్రయోజనాలు ముస్లిం వర్గాలకు కలుగుతున్నాయి. కానీ రాజకీయ రంగు పులమడంతో ఆందోళనలు జరుగుతున్నాయన్న వాదనవినిపిస్తోంది.

Waqf Bill is bringing many benefits: వక్ఫ్ బిల్లుకు  పార్లమెంట్ లో ఆమోదం లభించింది. రాష్ట్రపతి గెజిట్ కూడా జారీ చేశారు. దీంతో చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ బిల్లు ముస్లిం వర్గాలకు అన్యాయం చేస్తుందని పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న బెంగాల్, తమిళనాడు వంటి చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఇండియా కూటమిపార్టీలు పార్లమెంట్ లో ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలను ఆందోళనలకు ప్రోత్సహిస్తున్నాయి.  కేంద్ర ప్రభుత్వం మతపరమైన వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో అవినీతి, దుర్వినియోగాన్ని అరికట్టడానికి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 2025 తీసుకువస్తున్నామని స్పష్టం చేసింది. కానీ చట్టంలోని అసలు నిజాలను దాచి ప్రచారం చేస్తూండటంతో ఆందోళనలకు ప్రేరేపిస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

వక్ఫ్ బిల్లు వల్ల ముస్లిం వర్గాలకు అనేక ప్రయోజనాలు

వక్భ్ బిల్లు వల్ల ముస్లింలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పటి వరకూ ఎన్నో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయి. అలాగే ఏ ఆస్తినైనా  వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకునే పరిస్థితి ఉండేది. దీని వల్ల సమస్యలు వచ్చేవి.   వక్ఫ్ బోర్డులకు ఏకపక్ష అధికారాలను ఇచ్చే నిబంధన సెక్షన్ 40ని రద్దు చేయడంతో మతపరమైన ఆస్తుల దుర్వినియోగం తగ్గుతుంది.  
 
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ 

ఈ  చట్టం లక్ష్యం  వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత. పరిరక్షణ. డిజిటలైజేషన్  రిజిస్ట్రేషన్ ప్రక్రియల ద్వారా ఆస్తుల దుర్వినియోగాన్ని తగ్గించి, వాటిని మరింత సమర్థవంతంగా మసీదులు, మదర్సాలు, ఆస్పత్రులు,   సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగించవచ్చు. దీనివల్ల పేద ముస్లిములకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. 

 ఆక్రమణల నియంత్రణ 

వక్ఫ్ ఆస్తులపై ఆక్రమణలు దశాబ్దాలుగా ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. ఈ బిల్లు జిల్లా కలెక్టర్లు లేదా ఇతర అధికారుల ద్వారా సర్వేలను నిర్వహించి, ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవచ్చు.  దీనివల్ల వక్ఫ్ ఆస్తులు తిరిగి సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగపడే అవకాశం ఉంది.

 వివిధ వర్గాల ప్రాతినిధ్యం 

ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చడం  బోహ్రా, అఘాఖానీ వంటి ఇతర ముస్లిం ఉపవర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం వంటి నిబంధనలు ఉన్నాయి. ఇది వక్ఫ్ నిర్వహణలో సమ్మిళిత విధానాన్ని ప్రోత్సహించి, అందరి ప్రయోజనాలను పరిరక్షించవచ్చని  భావిస్తున్నారు. అలాగే  2006 సచార్ కమిటీ నివేదికలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో సంస్కరణలు అవసరమని సూచించింది.  ఆస్తుల ఆదాయాన్ని పెంచి, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా చట్టంలో ఉంది. 

 లిటిగేషన్ తగ్గింపు  

వక్ఫ్ ఆస్తులపై వివాదాలు   కోర్టు కేసులు గణనీయంగా తగ్గించేందుకు ఈ చట్టాన్ని  ఉద్దేశించారు.  స్పష్టమైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటేషన్ ద్వారా, ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధత తొలగి, సమాజానికి మరింత స్థిరత్వం లభిస్తుంది. 
 
ఇది ముస్లిం వ్యతిరేక చట్టమని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. కానీ  న్యాయం కోసం, పారదర్శకత కోసం చేసిన సంస్కరణ. రాజకీయ పార్టీలు ముస్లింలను రెచ్చగొట్టడం వల్లనే ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి.     

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget