అన్వేషించండి

Telugu News: ఇండస్ట్రీయల్ కారిడార్‌లతో ఏంటి ప్రయోజనం- కొప్పర్తి, ఓర్వకల్‌, జహీరాబాద్‌కు మహర్దశ వచ్చినట్టేనా!

Telugu News: కేంద్రప్రభుత్వం ఆమోదించిన 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీల్లో తెలుగు రాష్టాల్లోనే మూడు ఉన్నాయి. ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్‌.. తెలంగాణలోని జహీరాబాద్‌లో పారిశ్రామిక వాడలు ఏర్పాటుకానున్నాయి.

Industrial Cities in Andhra Pradesh And Telangana: తెలుగు రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిందింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా 12 ఇండిస్ట్రియల్‌ స్టార్మ్‌ సిటీలను ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్‌... ఆ 12లో మూడింటిని తెలుగు రాష్ట్రాలకు  కేటాయింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు, తెలంగాణలో ఒక ఇండస్ట్రియల్‌ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ ద్వారా లక్షలాది మంది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

కొపర్తికి మహర్దశ
కొప్పర్తి (Kopparthi)కి మహర్దశ పట్టనుంది. విశాఖ-చెన్నై కారిడార్‌లో భాగంగా.. కొప్పర్తిని పారిశ్రామిక హబ్‌ మారుస్తామని ప్రకటించింది కేంద్రం. 2వేల 596 ఎకరాల్లో 2వేల 137 కోట్ల వ్యయంతో పారిశ్రామిక హబ్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం  నిర్ణయించింది. కొప్పర్తిలో ఉత్పత్తి రంగంపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. దాదాపు 54 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ప్రధానంగా రెన్యూవబుల్స్‌, ఆటో మొబైల్స్‌ విడిబాగాలు, నాన్‌ మెటాలిక్‌ మినరల్స్‌, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్‌,  ఇంజినీరింగ్‌ విడిభాగాలు, మెటాలిక్‌ వస్తువుల ఉత్పత్తికి అనుగుణంగా.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను డెవలప్‌ చేయనున్నారు.

కొప్పర్తి పారిశ్రామిక వాడతో... రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందుతుందని కేంద్రం భావిస్తోంది. కొప్పర్తి ఇండస్ట్రియల్‌  కారిడార్‌ అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులను కల్పించనున్నారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టు కనెక్టిటివీ అంశాలను కూడా పరిశీలించనున్నారు. బెంగళూరు, చెన్నై 260 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అలాగే... జాతీయ రహదారి-51, కడప-పులివెందుల రహదారి సమీపంలోనే ఉన్నాయి. జాతీయ రహదారి-40, జాతీయ రహదారి 716, జాతీయ రహదారి-544 కూడా 10 కిలోమీటర్ల లోపే ఉన్నాయి. కడప ఎయిర్‌పోర్టు కూడా 11 కిలోమీటర్లే ఉంటుంది. తిరుపతి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు 150 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. పోర్టుల విషయానికి వస్తే.. కృష్ణపట్నం 200 కిలోమీటర్లు, చెన్నై పోర్టు 260 కిలోమీటర్లలోనే ఉంది. కనెక్టివిటీ కన్వినెంట్‌గా ఉండటంతో... కొప్పర్తి ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌  సిటీగా... వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక.. కొప్పర్తిలో ఇప్పటికే వైఎస్‌ఆర్‌ పారిశ్రామిక హబ్‌ ఉంది. ఆల్‌ డిక్సన్‌ కంపెనీ మూడు ఫిఫ్టుల ప్రకారం... ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ ఉత్పత్తి చేస్తోంది. కొన్ని ఎంఎస్‌ఎంఈ (MSME)లు కార్యకలాపాలు  కొనసాగిస్తున్నాయి.

ఓర్వకల్‌లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌
ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని ఓర్వకల్‌ లో రెండో ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్‌లో 2వేల 621 ఎకరాల్లో పారిశ్రామికవాడను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 2వేల 786 కోట్లు  వెచ్చించనున్నారు. ఓర్వకల్‌ పారిశ్రామిక హబ్‌లో 12వేల కోట్ల పెట్టుబడుతు వస్తాయని... 45వేల మందికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అభిస్తాయని కేంద్రం భావిస్తోంది.

జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌...
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీగా ఏర్పాటు చేయనుంది కేంద్రం. జహీరాబాద్‌ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో... న్యాల్కల్‌, జరాసంగం మండలాల్లోని 17  గ్రామాల్లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ  నిర్మాణం జరగనుంది. మొదటి విడతలో... 3వేల 245 ఎకరాల్లో... 2వేల 361 కోట్ల వ్యయంతో.. మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇది... పూణె-మచిటీపల్నం నేషనల్‌ హైవే (NH-65)కి రెండు కిలోమీటర్ల దూరంలో... నిజాంపేట్‌-బీదర్‌  రహదారి (NH-16)కి, జహీరాబాద్‌-బీఆర్‌ రహదారి (NH-14)కి సమీపంలోనే ఉంటుంది. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR)కి 65 కిలోమీటర్లు, రీజనల్‌ రింగ్‌ రోడ్డు (RRR)కి 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం జరగనుంది. ఈ ఇండస్ట్రియల్‌  కారిడార్‌కు 10వేల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, లక్షా 74 వేల మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం తెలిపింది. జహీరాబాద్‌లో ఇప్పటికే పెద్దపెద్ద కంపెనీలు ఉన్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ముంగి లాంటి పరిశ్రమలే కాకుండా... నిజాం  షుగర్స్‌ కూడా జహీరాబాద్‌లో ఉన్నాయి. 

దేశంలో ఇండస్ట్రియల్‌ కారిడార్లు
ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందుకు నిన్నటి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌... ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, మహారాష్ట్రలోని డిగీ,  పంజాబ్‌లోని రాజ్‌పురా, పాటియాలా, యూపీలోని ఆగ్రా, బిహార్‌లోని గయా, కేరళలోని పాలక్కాడు, జమ్ముకశ్మీర్‌, హర్యానాలోనూ ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో... ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ వస్తువులు, ఫుడ్‌ ప్రోసెసింగ్‌  వంటి పరిశ్రమలు రానున్నాయి.ఈ  12 ఇండస్ట్రియల్‌ కారిడార్లలో 1.52 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అంతేకాదు... సుమారు 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి  లభిస్తుందని అన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget