అన్వేషించండి

Kotabommali PS Movie Review - కోట బొమ్మాళి పీఎస్ రివ్యూ: రాజకీయ చదరంగంలో పోలీసుల మధ్య యుద్ధం - థ్రిల్ ఇస్తుందా? లేదా?

Kotabommali PS Review In Telugu: మలయాళ హిట్ సినిమా 'నాయట్టు' స్ఫూర్తితో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. శ్రీకాంత్, వరలక్ష్మి, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ నటించారు.

సినిమా రివ్యూ: కోట బొమ్మాళి పీఎస్! 
రేటింగ్: 3/5
నటీనటులు: శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ, పవన్ తేజ్ కొణిదెల, బెనర్జీ తదితరులు 
మాటలు: నాగేంద్ర కాశి
ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి
సంగీతం: రంజిన్ రాజ్
సహ నిర్మాతలు: భాను కిరణ్ ప్రతాప, రియాజ్
నిర్మాతలు: 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి  
దర్శకత్వం: తేజ మార్ని
విడుదల తేదీ: నవంబర్ 24, 2023  

Kotabommali PS movie review in Telugu: 'లింగిడి లింగిడి...' పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో 'కోట బొమ్మాళి పీఎస్'పై ప్రేక్షకుల చూపు పడింది. ఈ సినిమాలో శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో... రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. 'జోహార్', 'అర్జున ఫాల్గుణ' తర్వాత తేజా మార్ని దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళ హిట్ ఫిల్మ్ 'నాయట్టు'కు రీమేక్ ఇది. అయితే... తెలుగుకు మార్పులు, చేర్పులు చేశారు. సినిమా ఎలా ఉంది? 

కథ (Kotabommali PS Movie Story): ఏపీలోని టెక్కలి ఉపఎన్నికను అధికార పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. హోమ్ మంత్రి బరిసెల జయరామ్ (మురళీ శర్మ)ను రంగంలోకి దించుతుంది. అయితే... అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్న సామజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణిస్తాడు. పెళ్లిలో మద్యం సేవించి వస్తున్న పోలీస్ జీప్ యాక్సిడెంట్ చేయడంతో అతను మరణిస్తాడు. ఆ జీపులో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ (శ్రీకాంత్), కొత్తగా డ్యూటీలో చేరిన కానిస్టేబుల్ రవి (రాహుల్ విజయ్), మహిళా కానిస్టేబుల్ కుమారి (శివానీ రాజశేఖర్) ఉంటారు. అయితే... జీపు నడిపింది వాళ్ళు కాదు. కానీ, ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు స్టేషనులో కుమారికి వరుసకు బావ అయ్యే మున్నా (పవన్ తేజ్ కొణిదెల)తో పాటు మరణించిన సామజిక వర్గానికి చెందిన కొందరితో రామకృష్ణ, రవి గొడవ పడతారు. దాంతో యాక్సిడెంట్ కాస్త రాజకీయ సమస్యగా మారుతుంది. 

రామకృష్ణకు పోలీస్ శాఖలో ఎంతో అనుభవం ఉంది. అడవుల్లో కూంబింగ్ చేసిన, ఎన్నో ఎన్కౌంటర్లకు కేస్ ఫైల్స్ రాసిన చరిత్ర అతడిది. దాంతో కేసు ఫైల్ ఎలా రాస్తారో అతనికి ఐడియా ఉంది. రవి, కుమారిలను తీసుకుని పరారీ అవుతాడు. మరోవైపు ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని హోమ్ మంత్రి శపథం చేస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎస్పీ రజియా అలీ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు ఆ బాధ్యత అప్పగిస్తారు. ఆ తర్వాత ఏమైంది? పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రామకృష్ణ ఏం చేశాడు? అతడిని పట్టుకోవడానికి రజియా ఏం చేసింది? ఎత్తుకు పైఎత్తులు వేస్తూ జరిగిన పోరులో అంతిమ విజయం ఎవరిది? అనేది వెండితెరపై చూడాలి. 

విశ్లేషణ (Kotabommali PS Telugu Movie Review): ప్రభుత్వం, అధికారం తమ చేతిలో ఉందని కొందరు వ్యక్తులు వ్యవస్థలను ఎలా శాసిస్తున్నారు? - ఈ తరహా కథాంశాలు ప్రేక్షకులకు కొత్త కాదు. కొన్ని సినిమాల్లో చూసే ఉంటారు. అయితే... వ్యవస్థలోని వ్యక్తులే బలిపశువు అయితే? వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? అనేది 'కోట బొమ్మాళి పీఎస్' / 'నాయట్టు' కథ.

'కోట బొమ్మాళి పీఎస్'లో బ్యూటీ ఏంటంటే... సహజత్వానికి దగ్గరగా, హై టెక్నికల్ వేల్యూస్ మిస్ కాకుండా తీయడం! సినిమా ప్రారంభమైన కాసేపటికి శ్రీకాకుళం ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళతారు. ఓ మలయాళ సినిమా రీమేక్ చూస్తున్న ఫీలింగ్ ఉండదు. యాస, భాష దగ్గర నుంచి నటీనటుల ఎంపిక వరకు దర్శక - రచయితలు తీసుకున్న జాగ్రత్తల కారణంగా కొత్త సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. 'నాయట్టు' చూసిన వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ ఉండటం సహజమే. అయితే... ఆ సినిమా చూడని మెజారిటీ ప్రేక్షకులకు 'కోట బొమ్మాళి' నచ్చుతుంది.

రాజకీయ నేపథ్యం ఉన్న 'జోహార్' తీసిన అనుభవం దర్శకుడు తేజా మార్నికి ఉంది. 'కోట బొమ్మాళి పీఎస్'లో పొలిటికల్ సీన్లుచక్కగా డీల్ చేశారు. రాజకీయ నాయకులను చూపించే విషయంలో గీత దాటలేదు. ఫస్టాఫ్ రేసీగా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఎమోషనల్ మూమెంట్స్ కూడా రావడంలో స్పీడ్ కొంచెం తగ్గుతుంది. కథ నుంచి బయటకు వెళ్లకుండా తీయడంతో కొన్ని ఎమోషన్స్ రెగ్యులర్‌గా అనిపిస్తాయి. అయితే... క్లైమాక్స్ వరకు సస్పెన్స్ మాత్రం మైంటైన్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అని చూసే థ్రిల్లర్ ఇది. పాటలు కథకు అడ్డు తగల్లేదు. నేపథ్య సంగీతం బావుంది. కెమెరా వర్క్ & ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బావున్నాయి. 

సినిమా అంతా ఒక ఎత్తు... 'కోట బొమ్మాళి పీఎస్' పతాక సన్నివేశాల్లో మన వ్యవస్థ గురించి మురళీ శర్మ చెప్పే డైలాగులు మరో ఎత్తు. ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నాగేంద్ర కాశి సింపుల్‌, ఎఫెక్టివ్‌ డైలాగ్స్‌ రాశారు.

నటీనటులు ఎలా చేశారంటే: శ్రీకాంత్ నటనను ఆవిష్కరించే పాత్రలు ఇటీవల కాలంలో ఆయనకు అరుదుగా లభిస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. అయితే... కథకు ఆ క్యారెక్టర్లు అలంకారప్రాయంగా మాత్రమే ఉంటున్నాయి. ఈ తరుణంలో 'కోట బొమ్మాళి పీఎస్'లో రామకృష్ణ రోల్ మరోసారి శ్రీకాంత్ నటనను ఆవిష్కరించింది. 'ఖడ్గం' తరహాలో ఆయనకు మరో మెమరబుల్ రోల్ అవుతుంది. 

సినిమా ప్రారంభంలో రామకృష్ణ క్యారెక్టర్ చూస్తే... ఓ సాధారణ కానిస్టేబుల్ టైపులో ఉంటుంది. ఆయన కూడా సహజంగా నటించారు. కథ ముందుకు వెళ్లే కొలదీ హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు బావుంది. అలాగే, ఆయన నటన! ఓ తండ్రిగా పతాక సన్నివేశాల్లో కుమార్తె గురించి చెప్పే సన్నివేశం కంటతడి పెట్టిస్తుంది. ఈ కథకు అసలైన హీరో శ్రీకాంత్. యాంటీ హీరో వరలక్ష్మీ శరత్ కుమార్. ఎందుకంటే ఆమెను విలన్ అనలేం! ఓ విధమైన నవ్వు, బాడీ లాంగ్వేజ్ మైంటైన్ చేస్తూ కథపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించారు. 

Also Readఆదికేశవ రివ్యూ: మెగా మేనల్లుడి ఊర మాస్ యాక్షన్ - వైష్ణవ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?

రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లలా కాకుండా కేవలం పాత్రల్లో ఒదిగిపోయారు. మురళీ శర్మ మరోసారి టిపికల్ మేనరిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ప్రవీణ్, బెనర్జీ, సీవీఎల్ నరసింహారావు, దయానంద్, పవన్ తేజ్ కొణిదెల తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.   

Also Readమమ్ముట్టి, జ్యోతిక మలయాళ సినిమా రివ్యూలు ఎలా ఉన్నాయ్ - ట్విట్టర్ టాక్ ఏంటి?

చివరగా చెప్పేది ఏంటంటే: 'కోట బొమ్మాళి పీఎస్' ఓ స్లో పాయిజన్. సాదాసీదాగా మొదలై, కాసేపటికి తన ప్రపంచంలోకి మనల్ని తీసుకు వెళుతుంది. తెరపై ఏం జరుగుతుంది? అని ఆలోచింపజేసే గ్రిప్పింగ్ థ్రిల్లర్. రెండు గంటలు మనల్ని మనం మర్చిపోతాం. శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ నటన అంతలా కట్టి పడేస్తుంది. సహజత్వానికి దగ్గరగా తీసిన చిత్రమిది. నోటు తీసుకుని ఓటు వేసే ప్రజల్ని, వ్యవస్థను ఎత్తిచూపుతూ మురళీ శర్మ చెప్పే మాటలు ఆలోచింపజేస్తాయి. కంటెంట్ బేస్డ్ సినిమాలు కోరుకునే ప్రేక్షకులు అసలు మిస్ అవ్వకండి.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABPMysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP DesamKL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Manoj Bharathiraja: తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025 PBKS VS GT Result Update : పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
Embed widget