అన్వేషించండి

Heart Attack: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?

గుండెపోటు, కార్డియాక్ అరెస్టు... ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా దాడి చేసి ప్రాణాలు హరిస్తున్న మహమ్మారులు.

గుండెపోటు, కార్డియాక్ అరెస్టు వంటి ఆరోగ్య అత్యవసరస్థితులు అనుకోకుండా దాడి చేస్తాయి. మనిషిని అపస్మారక స్థితిలోకి తీసుకెళ్తాయి. అలాంటప్పుడు రోగికి ప్రాథమిక చికిత్స అవసరం పడుతుంది. లేకుంటే కొన్ని నిమిషాల్లోనే మరణం సంభవించడం ఖాయం. అలాంటి ప్రాథమిక చికిత్సలో ప్రధానమైనది కార్డియో పల్మోనరీ రిససిటేషన్ (CPR).ఆగిపోయిన గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడమే సీపీఆర్. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ.  ఇంకా వివరంగా చెప్పాలంటే గుండె పనిచేయడం ఆగిపోవడం వల్ల శరీరభాగాలకు రక్త సరఫరా నిలిచిపోతుంది, ఆ రక్త సరఫరాను తిరిగి పంపణీ అయ్యేలా చేయడమే సీపీఆర్. 

సీపీఆర్ ఎప్పుడు చేయాలి?
గుండె పోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడో లేదో వెంటనే గమనించాలి. ఛాతీ పై చెవి పెట్టి వింటే గుండె శబ్ధం వినిపిస్తుంది. అలా వినిపించకపోయినా, ముక్కు నుంచి శ్వాస తీసుకోకపోయినా వెంటనే సీపీఆర్ మొదలుపెట్టచ్చు. ఈలోపు ఎవరినైనా అంబులెన్సుకు ఫోన్ చేయమని చెప్పాలి. సీపీఆర్ చేయడం వల్ల ఎలాంటి కీడు జరుగదు కాబట్టి భయపడకుండా ఆపదలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ చేయమని చెబుతున్నారు వైద్యులు. 

ఎలా చేయాలి?
1. గుండెపోటు లేదా కార్డియక్ అరెస్టుకు గురైన వ్యక్తిని నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. 
2. రెండు చేతులతో ఛాతీ మధ్యలో బలంగా అదమాలి. అలా 30 సార్లు వరుసగా అదమాలి. మధ్యలో రెండు నోటితో నోటిలోకి శ్వాసను ఇవ్వాలి. ఇలా ఆ వ్యక్తికి స్పృహ వచ్చేవరకు చేయాలి. 
3. పిల్లలకు మాత్రం ఛాతీ మధ్యలో ఒక చేతితోనే అదమాలి. ఇక శిశువుల విషయానికి కేవలం ఛాతీ మధ్యలో రెండు వేళ్లతో మాత్రమే అదమాలి. 

సీపీఆర్ చేయడం వల్ల ప్రపంచంలో చాలా మంది ప్రాణాలు నిలిచాయి. సీపీఆర్ ఆగిపోయిన శరీరభాగాలకు తిరిగి రక్తం పంపిణీ అయ్యేలా చూస్తుంది. మెదడుకు కూడా రక్త సరఫరా జరిగేలా చూస్తుంది. ఈలోపు ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాపాయం తప్పుతుంది. 

అలా అని ప్రతిసారి సీపీఆర్ ప్రాణం పోయదు. గుండె పోటు తీవ్ర స్థాయిలో వచ్చినా, కార్డియాక్ అరెస్టు కూడా ఊహించనంత తీవ్రంగా దాడి చేసినా... ప్రాణం కాపాడుకోవడం కష్టమవుతుంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: బట్టతల బాబాయ్‌లకు గుడ్ న్యూస్... జుట్టును పెంచే ప్రోటీన్‌ను కనుగొన్న హార్వర్డ్ శాస్త్రవేత్తలు, త్వరలో శాశ్వత పరిష్కారం

Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు

Also read:  తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?

Also read: ఇది మంగళసూత్రం ప్రకటనా లేక లోదుస్తుల ప్రకటనా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vishnu Meet Lokesh: నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
నారా లోకేష్‌ను కలిసిన మంచు విష్ణు - ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల కోసమేనా ?
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TSPSC New Chairman Venkatesam: తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం - రేవంత్ ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Singapore: భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
భార్యకు బంగారు చైన్ కొనిస్తే డ్రాలో రూ.8 కోట్ల లాటరీ తగిలింది - ఈ డబ్బులు భార్యవా ? భర్తవా ?
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Telugu Student Dies In US: అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
అమెరికాలోని చికాగోలో కాల్పులు- ఖమ్మం యువకుడు సాయితేజ్ మృతి
Embed widget