Patanjali CSR Initiatives: CSR కార్యక్రమాలతో విప్లవాత్మక మార్పులు- పల్లెల రూపురేఖలు మారుస్తున్న కార్పొరేట్ కంపెనీలు
Patanjali CSR Initiatives: భారతీయ సంస్థలు చేపట్టే సీఎస్‌ఆర్ కార్యక్రమాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Patanjali CSR Initiatives: ఇటీవల కాలంలో భారతదేశంలోని కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా చేపట్టే కార్యకలాపాలు కీలకమైన సామాజిక సమస్యలు పరిష్కరిస్తున్నాయి. గ్రామీణాభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. పతంజలి ఆయుర్వేదం, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా &మహీంద్రా వంటి కంపెనీలు తమ CSR కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధికి భుజం కాస్తున్నాయి. గణనీయమైన మార్పులు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కంపెనీలు, వాటి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులు తమ CSR కార్యక్రమాల ద్వారా ఉచిత యోగా శిబిరాలు, ఆయుర్వేద పరిశోధనా కేంద్రాలు, గ్రామీణాభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
పతంజలి సహా ఈ సంస్థలు, వాటి ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడమే కాకుండా రైతులను సేంద్రీయం వైపులు అడుగులు వేసేలా చేస్తున్నాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రముఖ భారతీయ కంపెనీలు ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామాల్లో పరిశ్రమలు స్థాపిస్తున్నాయి.
విద్యా రంగంలో ఆచార్యకుళం పాఠశాలలు, గురుకులాలు వంటి సంస్థలు యోగా ద్వారా ఆధునిక విద్యకు భారతీయ సంస్కృతిని మిళితం చేస్తున్నాయి.
మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తున్నాయి
నేడు ప్రముఖ భారతీయ కంపెనీలు, సంస్థలు తమ CSR చర్యల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకువస్తున్నాయి. ఉదాహరణకు టాటా గ్రూప్ విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టింది.
టాటా ట్రస్ట్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను స్థాపించారు. వెనుకబడిన పిల్లలకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరోగ్య సంరక్షణ, మహిళా సాధికారతకు గణనీయమైన కృషి చేస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను స్థాపించడం
మహీంద్రా & మహీంద్రా పర్యావరణ పరిరక్షణ, విద్య రంగాల్లో తన CSR కార్యకలాపాల ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తోంది. వారు చెట్ల పెంపకం ఆవశ్యకతను ప్రచారం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను స్థాపించారు. ఈ ప్రయత్నాలన్నీ పేదరికం, నిరక్షరాస్యత, పర్యావరణ పరిరక్షణ వంటి ముఖ్యమైన సామాజిక సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతున్నాయి. ఈ CSR కార్యకలాపాలు సమాజానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.





















