NCL Jobs: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 206 టెక్నీషియన్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 206 ఖాళీలను భర్తీచేయనున్నారు.

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 206 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఇందులో 200 రెగ్యులర్ పోస్టులుకాగా.. 6 బ్యాగ్‌లాగ్ పోస్టులు ఉన్నాయి.పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అదేవిధంగా అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ చేపడతారు.
వివరాలు..
* టెక్నీషియన్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 206.
పోస్టుల కేటాయింపు: జనరల్-85, ఈడబ్ల్యూఎస్-17, ఓబీసీ-34, ఎస్సీ-32, ఎస్టీ-38.
1) టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ): 95
2) టెక్నీషియన్ ఎలక్ట్రిషీయన్ (ట్రైనీ): 95
3) టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ): 10

విభాగాలు: ఎక్స్కవేషన్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యూలేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత, అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సంస్థ ఉద్యోగులకు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1180 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో సెక్షన్-ఎ నుంచి 70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-బి నుంచి 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.04.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు చివరితేదీ: 10.05.2025.





















