Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
Ramya Moksha Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త పేరు 'రమ్య మోక్ష పికిల్స్'తో మళ్లీ బిజినెస్ స్టార్ట్ చేయనున్నట్లు చిట్టి చెల్లెలు అనౌన్స్ చేశారు.

రమ్య మోక్ష కంచర్ల తన ఫ్యూచర్ ప్లాన్స్ వెల్లడించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మూసివేసిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నది తాజా వీడియోలో వివరించారు. పికిల్స్ బిజినెస్ మళ్లీ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే తమ వ్యాపారాన్ని కొత్త పేరుతో ప్రారంభిస్తామని ఆవిడ పేర్కొన్నారు.
అలేఖ్య చిట్టి కాదు... రమ్య మోక్ష పికిల్స్!
పికిల్స్ వ్యాపారంలో తమకు ఏడాది పాటు అనుభవం ఉందని, ఈ ఏడాదిలో తాము ఎంతో నేర్చుకున్నామని రమ్య మోక్ష కంచర్ల తాజా వీడియోలో వివరించారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మొదలు పెట్టిన సమయంలో తన పేరు మీద స్టార్ట్ చేయాలని భావించామని, అయితే అప్పటికి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో పాటు కొన్ని సినిమాలు చేయడం వల్ల పికిల్స్ బిజినెస్ అంటే బాగోదని తండ్రి సలహా మేరకు తన అక్క పేరు మీద అలేఖ్య చిట్టి పికిల్స్ అని స్టార్ట్ చేసినట్లు చెప్పారు.
కాంట్రవర్సీ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ మూసివేయాల్సి వచ్చిందని రమ్య మోక్ష వివరించారు. వివాదం తమను ఎంతో ఇబ్బంది పెట్టిందని, అందువల్ల బిజినెస్ క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవిడ తెలిపారు. ఇంకా రమ్య మోక్ష మాట్లాడుతూ... ''ఈ 11 మంత్స్ లోనే క్లోజ్ చేసేస్తామని అస్సలు అనుకోలేదు. సో బిజినెస్ అయితే అఫీషియల్ గా క్లోజ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ ఏంటి? అనేది ఒక డైలమాలో మేము అందరం ఉన్నాము. ఈసారి అలేఖ్య చిట్టి పికిల్స్ అని కాకుండా రమ్య మోక్ష పికిల్స్ అని కమ్ బ్యాక్ అయితే స్ట్రాంగ్ గా ఇద్దాం అనుకుంటున్నాను'' అని చెప్పారు.
అలేఖ్య చిట్టి పికిల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న సపోర్టు ఇప్పుడు ఉంటుందా? లేదా? అనేది తనకు అర్థం కావట్లేదని, కచ్చితంగా ఎక్కడో పాజిటివ్ వైబ్ ఉందని, తమ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఇంకా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కం బ్యాక్ ఇవ్వమని చేస్తున్న మెసేజెస్ చూశానని రమ్య మోక్ష చెప్పారు. ఈసారి పెట్టబోయే బిజినెస్ రమ్య మోక్ష పికిల్స్ కచ్చితంగా అందరూ కొనగలిగే ధరలలో, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచిగా బిజినెస్ రన్ చేద్దామనుకుంటున్నామని రమ్య మోక్ష వివరించారు.
కస్టమర్లతో మాట్లాడటం కోసం స్పెషల్ పర్సన్!
ఈసారి కస్టమర్లతో మాట్లాడడానికి ఒక వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకుందామని అనుకుంటున్నామని రమ్య మోక్ష తెలిపారు. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, మా సిస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈసారి చేయబోయేదంతా తాను మాత్రమే చేస్తానని ఆవిడ తెలిపారు. ఇంతకు ముందు ఎలా అయితే సపోర్ట్ చేశారో, సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్ననట్లు తెలిపారు. లైసెన్సులు తీసుకునే తాము బిజినెస్ చేసినట్లు తెలిపారు. అలేఖ్య చిట్టి పికిల్స్ మీద తాము సంపాదించినది ఏమీ లేదని, అదంతా తండ్రి ట్రీట్మెంట్ కోసం సరిపోయిందని ఆవిడ తెలిపారు.
Also Read: మూడు నెలలుగా మిస్సింగ్... ఇప్పుడు శవమై కనిపించాడు... పాతికేళ్లు నిండక ముందే ఇలా జరగడంతో...





















