Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
IPL 2025:పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 50 పరుగులైనా దాటుతుందా లేదా అని చాలా మందికి అనిపించే ఉంటుంది. అలా డగౌట్‌కు ఆర్సీబీ బ్యాటర్లు క్యూ కట్టారు. ఇలాంటి మ్యాచ్‌లు ఐపీఎల్‌లో ఎన్ని ఉన్నాయో తెలుసా?

IPL 2025: ఐపీఎల్ అంటే బ్యాటర్లు సిక్స్‌లు కొడుతున్నప్పుటే కాకుండా వికెట్లు పడుతున్నప్పుడు కూడా మాజా వస్తుంది. అలాంటిది పెద్ద పెద్ద జట్లు కూడా వంద పరుగులు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నప్పుడు నిజమైన క్రికెట్ అభిమానులకు మ్యాచ్ చూడటానికి ఆసక్తిగా అనిపిస్తుంది. అలాంటి మ్యాచ్‌లో ఐపీఎల్‌లో చాలానే జరిగాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకే మ్యాచ్‌లో ఓవర్లు కుదించారు. కేవలం 14 ఓవర్లే ఆడించారు. అందుకే ఎక్కువ స్కోరు చేయాలనేే ఆలోచనతో బెంగళూరు త్వరత్వరంగా వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 60 పరుగులు కావడం క,ష్టమే అనుకున్నా డేవిడ్ ఆటతో మంచి స్కోర్ సాధించగలిగింది. మొత్తానికి 14 ఓవర్లలో 96 పరుగు లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచింది.
ఇప్పటి వరకు అత్యల్ప స్కోరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మీదే ఉంది. ఆ జట్టు 2017 ఏప్రిల్ 23న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 82 పరుగులతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో రెండో అత్యల్ప స్కోరు 58 పరుగులు. ఇది రాజస్థాన్ రాయల్స్ పేరున ఉంది. బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లో 2009 ఏప్రిల్ 18 జరిగిన మ్యాచ్‌లో ఈ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 75 పరుగులతో విజయం సాధించింది.
మూడో అత్యల్ప స్కోరు రికార్డు కూడా రాజస్థాన్ రాయల్స్ పేరు మీదనే ఉంది. అది కూడా బెంగళూరుపై జరిగిన మ్యాచ్‌లోనే 59 పరుగులు మాత్రమే చేసింది. 14మే 2023న జైపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 112 పరుగుల తేడాతో గెలిచింది.
అత్యల్ప స్కోరు రికార్డులు ఇలా ఉన్నాయి.
| jjస్కోరు | తక్కువ స్కోరు చేసిన జట్టు | ప్రత్యర్థి జట్టు | మ్యాచ్ ఎప్పుడు జరిగింది. | ఫలితం ఏంటీ? |
| 49 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | 2౩ ఏప్రిల్ 2017 | కేకేఆర్ 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. |
| 58 | రాజస్థాన్ రాయల్స్ | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | 18 ఏప్రిల్ 2009 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్75పరుగుల తేడాతో విజయం సాధించింది. |
| 59 | రాజస్థాన్ రాయల్స్ | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | 14 మే 2023 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్112 పరుగుల తేడాతో విజయం సాధించింది. |
| 66 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | ముంబై ఇండియన్స్ | 6 మే 2017 | ముంబై ఇండియన్స్146 పరుగుల తేడాతో విజయం సాధించింది. |
| 67 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | 30 ఏప్రిల్‌్ 2017 | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. |
| 67 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | ముంబై ఇండియన్స్ | 16 మే 2008 | ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. |
| 68 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 23 ఏప్రిల్ 2023 | సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. |
| 70 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | 23 మార్చ్ 2023 | చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. |
| 70 | రాయల్ బెంగళూరు ఛాలెంజర్స్ | రాజస్థాన్ రాయల్స్ | 26 ఏప్రిల్ 2014 | 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం |
| 73 | కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | రైజింగ్ పూణె సూపర్ జెయింట్ | 14 మే 2017 | రైజింగ్ పూణె సూపర్ జెయింట్ 9 వికెట్ల తేడాతో విజయం |
| 74 | కొచ్చి టస్కర్ కేరళ | డెక్కన్ ఛార్జెర్స్ | 27 ఏప్రిల్ 2011 | డెక్కన్ ఛార్జెర్స్ 55 పరుగుల తేడాతో విజయం |
| 79 | చెన్నై సూపర్ కింగ్స్ | ముంబై ఇండియన్స్ | 5 మే 2013 | 60 పరుగులు తేడాతో ముంబై ఇండియన్స్ విజయం |
| 80 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 4 మే 2013 | 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం |
| 81 | రాజస్థాన్ రాయల్స్ | కోల్‌కతా నైట్‌రైడర్స్ | 17 ఏప్రిల్ 2011 | కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం |
| 82 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | కోల్‌కతా నైట్‌రైడర్స్ | 18 ఏప్రిల్ 2008 | 140 పరుగులు తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం |
| 82 | డెక్కన్ ఛార్జెర్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 24 ఏప్రిల్ 2010 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో విజయం |
| 82 | లక్నో సూపర్ జెయింట్స్ | గుజరాత్ టైైటాన్స్ | 10 మే 2022 | గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో విజయం |
| 83 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | 18 ఏప్రిల్ 2013 | చెన్నై సూపర్ కింగ్స్ 86 పరుగుుల తేడాతో విజయం సాధించింది. |
| 84 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 21 అక్టోబర్ 2020 | 8 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు |
| 84 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | చెన్నై సూపర్ కింగ్స్ | 21 ఏప్రిల్ 2014 | చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం |
| 85 | రాజస్థాన్ రాయల్స్ | కోల్‌కతా నైట్‌రైడర్స్ | 7 అక్టోబర్ 2021 | 86 పరుగులు తేడాతో కోల్‌కతా విజయం |
| 87 | ముంబై ఇండియన్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 24 మే 2018 | 31పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం |
| 87 | ఢిల్లీ డేర్ డెవిల్స్ | రాజస్థాన్ రాయల్స్ | 30 మే 2008 | రాజస్థాన్ రాయల్స్105 పరుగుల తేడాతో విజయం |
| 87 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | చెన్నై సూపర్ కింగ్స్ | 20 ఏప్రిల్ 2009 | 92 పరుగులు తేడాతో చెన్నై విజయం |
| 87 | ముంబై ఇండియన్స్ | కింగ్స్ లెవన్ పంజాబ్ | 10మే 2011 | 76 పరుగుల తేడాతో కింగ్స్ లెవన్ పంజాబ్ విజయం |
| 88 | కింగ్స్ లెవన్ పంజాబ్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 14 మే 2018 | 10వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం |
| 88 | కింగ్స్ లెవన్ పంజాబ్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 6 మే 2015 | 138 పరుగులు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం |
| 89 | గుజరాత్ టైటాన్స్ | ఢిల్లీ క్యాపిటల్స్ | 17 ఏప్రిల్ 2024 | 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం |
| 90 | రాజస్థాన్ రాయల్స్ | ముంబై ఇండియన్స్ | 5 అక్టోబర్ 2021 | 8 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం |
| 92 | కింగ్స్ లెవన్ పంజాబ్ | చెన్నై సూపర్ కింగ్స్ | 20 మే 2009 | 24 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం |
| 92 | రాజస్థాన్ రాయల్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 18 మార్చ్ 2010 | 10 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం |
| 92 | ముంబై ఇండియన్స్ | ఢిల్లీ డేర్‌డెవిల్స్ | 16 ఏప్రిల్ 2012 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ 7 వికెట్ల తేడాతో విజయం |
| 92 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | కోల్‌కతా నైట్‌రైడర్స్ | 20 సెప్టెంబర్ 2021 | 9 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం |
| 92 | ముంబై ఇండియన్స్ | రాజస్థాన్ రాయల్స్ | 17 ఏప్రిల్ 2013 | 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ విజయం |
| 92 | ముంబై ఇండియన్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 8 మే 2016 | 85 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం |
| 94 | ముంబై ఇండియన్స్ | రాజస్థాన్ రాయల్స్ | 29 ఏప్రిల్ 2011 | 33 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. |
| 95 | కింగ్స్ లెవన్ పంజాబ్ | చెన్నై సూపర్ కింగ్స్ | 25 ఏప్రిల్ 2015 | 134 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం |
| 95 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 26 ఏప్రిల్ 2015 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం |
| 95 | ఢిల్లీ డేర్‌డెవిల్స్ | ముంబై ఇండియన్స్ | 10 ఏప్రిల్ 2011 | ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో విజయం |
| 95 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | ముంబై ఇండియన్స్ | 27 ఏప్రిల్ 2009 | 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్ విజయం |
| 95 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | పంజాబ్ కింగ్స్ | 15 ఏప్రిల్ 2025 | 16 పరుగులు తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం |
| 95 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | పంజాబ్ కింగ్స్ | 18 ఏప్రిల్ 2025 | |
| 96 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | రైజింగ్ పూణె సూపర్ జెయింట్ | 29 ఏప్రిల్ 2017 | 61 పరుగులు తేడాతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ |




















