Madhavan's Favourite Kanji : హీరో మాధవన్ ఫేవరెట్ కాంజీ రెసిపీ.. నైట్ ప్రిపేర్ చేసి, మార్నింగ్ తింటే బరువు తగ్గడం నుంచి ఎన్నో బెనిఫిట్స్
Kanji Recipe : 5 పదుల వయసు దాటినా మాధవన్ చార్మ్ ఎవర్గ్రీన్. తాజాగా హిజాబ్ బరాబర్లో కూడా చాక్లెట్ బాయ్ వైబ్స్ తీసుకొచ్చాడు. అయితే ఈ హీరోకి ఓ హెల్తీ ఫుడ్ అంటే చాలా ఇష్టమట. అదేంటంటే..

Rice kanji Recipe : తమిళ హీరో మాధవన్ తన లుక్స్‌తో, పర్సనాలిటీతో, తన మాటలతో, నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 54 ఏళ్ల వయసులో కూడా అతనికున్న లేడీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరో రీసెంట్గా ఓ ఫుడ్ తనకు చాలా ఇష్టమని.. ప్రతిరోజూ ఉదయాన్ని దానిని తీసుకుంటానని చెప్పాడు. అదే కాంజీ.
ఇదేదొ కొత్త రెసిపీ అనుకునేరు. పేరు కొత్తే కానీ.. రెసిపీ చూస్తే ఓహ్ ఇదేనా అనుకుంటారు. మీరు ఇదేనా అనుకునే రెసిపీ.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుంటే.. రోజూ మీరు ఈ కాంజీనే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఇంతకీ మాధవన్కి ఇష్టమైన కాంజీ రెసిపీ ఏంటి? ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
అన్నం - కప్పు
నీళ్లు - ముప్పావు కప్పు
ఉప్పు - రుచికి తగినంత
పెరుగు - ముప్పావు కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
తాళింపు కోసం..
ఆవనూనె - 1 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఆవాలు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెబ్బ
జీలకర్ర - అర టీస్పూన్
తయారీ విధానం
ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ముందుగా మట్టి గిన్నెలో లేదా గాజు గిన్నెలో రైస్ వేసి.. దానిలో నీళ్లు వేసి.. మూత పెట్టేయాలి. ఉదయాన్నే దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. అనంతరం పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలిపేయాలి. ఆవనూనెను వేడి చేసి దానిలో ఇంగువ, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకుని ఈ తాళింపు రైస్‌లో వేసేయాలి. అంతే కాంజీ రెడీ.
ఇప్పటికీ ఐడియా వచ్చే ఉంటుంది ఇది చద్దన్నమని. తెలుగు రాష్ట్రాల్లో దీనిని ఎన్నో ఏళ్లుగా తీసుకుంటున్న.. అందరికీ తెలిసిన రెసిపీనే ఇది. అయితే దీనిని కొన్ని ప్రాంతాల్లో దీనిని ఒక్కో విధంగా చేస్తారు. ఒక్కో పేరుతో పిలుస్తారు. కొందరు పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా రాత్రే వేసేస్తారు. మరికొందరు తాళింపు వేయరు. అయితే దీనిని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. హెల్తీ గట్‌ని ప్రమోట్ చేస్తుంది. స్కిన్‌ని మెరుగ్గా చేయడం, జుట్టు పెరుగుదలను ప్రోత్సాహిస్తుంది.
ఈ ప్రోబయోటిక్ ఫుడ్ గట్ హెల్త్‌ని ప్రమోట్ చేసి.. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి.. పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. మెటబాలీజంను పెంచి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఉదయాన్నే దీనిని తింటే ఎనర్జిటిక్‌గా ఉంటారు. అంతేకాకుండా మైండ్ యాక్టివ్ అవుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించి.. పింపుల్స్‌ని దూరం చేస్తుంది. స్కిన్ గ్లోని మెరుగు చేస్తుంది.
Also Read : మూడేళ్లలో 32 కిలోలు తగ్గిన సీనియర్ హీరోయిన్.. కుష్బూ వెయిట్ లాస్ జర్నీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

