అన్వేషించండి

PM Internship Scheme: పీఎం ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - లాస్ట్‌ డేట్‌ ఇదీ

Top-500 Companies In India: PMIS కింద, దేశంలోని 500 పెద్ద కంపెనీలలో యువతకు ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అవకాశం దక్కుతుంది, నెలనెలా ఆర్థిక సాయం కూడా అందుతుంది.

Application Process Begins for PM Internship Schem: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (PMIS) రెండో రౌండ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం కింద, దేశంలోని 730కి పైగా జిల్లాల్లో ఒక లక్ష మందికి పైగా యువతకు పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశం లభిస్తుంది. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Corporate Affairs) దీని గురించి పత్రిక ప్రకటన విడుదల చేసింది.

ఈ వయసు యువత అర్హులు
పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం కింద, పూర్తి సమయపు విద్యా కార్యక్రమం (రెగ్యులర్‌ కోర్స్‌లు) లేదా ఉద్యోగంలో లేని 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతకు అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా, యువత తమ కెరీర్‌ను ప్రారంభించడానికి గొప్ప అవకాశం పొందుతారు. ఈ ప్రభుత్వ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) 2024-25 కేంద్ర బడ్జెట్‌లో (Union Budget 2024) ప్రకటించారు. ఈ పథకం లక్ష్యం.. నిరుద్యోగ యువత కెరీర్‌కు దిశానిర్దేశం చేయడం & న్యాయమైన ఉపాధి అవకాశాలను కల్పించడం. పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1 కోటి మందికి పైగా యువత ప్రయోజనం పొందుతారు. పైలట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 800 కోట్లు.       

పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? 
పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం లేదా PIMS కింద, యువత దేశంలోని టాప్‌-500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం pminternship.mca.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి మీ ప్రొఫైల్‌ సృష్టించండి. ఆ తరువాత, వివిధ రంగాల కంపెనీలలో ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. అప్లికేషన్‌ పంపడానికి ఆఖరు తేదీ మార్చి 12, 2025. ఈ పథకం కింద, ఒక్కో అభ్యర్థి గరిష్టంగా మూడు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.                  

ఇంటర్న్‌షిప్‌ కాలంలో ప్రతి నెలా డబ్బు
ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కింద, 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో, దేశంలోని పెద్ద కంపెనీల్లో నిజమైన పని అనుభవాలు, వ్యాపార కార్యకలాపాల గురించి నేర్చుకుంటారు. ఇంటర్న్‌షిప్‌ సమయంలో, ప్రతి నెలా రూ. 5,000 ఆర్థిక సాయం అందుతుంది. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత ఒకేసారి రూ. 6,000 లభిస్తుంది. 2025 డిసెంబర్ 02 నుంచి ఇంటర్న్‌షిప్ ప్రారంభం అవుతుంది.               

ఇంటర్న్‌లకు బీమా కవరేజ్ ప్రయోజనం 
ప్రభుత్వం పథకం కింద, ఇంటర్న్‌లు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PM Jeevan Jyoti Bima) & ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PM Surakha Yojana) కింద బీమా కవరేజీని పొందుతారు. ఆయా కంపెనీలు కూడా సొంతంగా ప్రత్యేక ప్రమాద బీమా కవరేజీని అందిస్తాయి.  

మరో ఆసక్తిర కథనం: ఈ రేట్ల దగ్గర కొనలేం, నగలను మరిచిపోండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ 

టాప్ హెడ్ లైన్స్

Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
October Rule Changes: అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంక్ FD, LPG లో మార్పులు, ఎన్‌పీఎస్ కొత్త స్కీమ్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Highest Tax in India: దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
దేశంలో అత్యధిక పన్ను విధించే వస్తువులు ఏవి? ఎంతమంది ఉపయోగిస్తున్నారంటే!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Telangana Congress BC CM : తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ సీఎం నినాదం - రేవంత్‌కు చెక్ పెట్టడానికా? సామాజిక వ్యూహమా?
Dharani I Love You: రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
రాజమౌళి 'మగధీర' అసోసియేట్ దర్శకత్వంలో 'ధరణి ఐ లవ్ యు'...
Singareni Workers Bonus: సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి కానుక.. ప్రతి కార్మికుడికి రూ.1,10,250 బోనస్‌!
AP Local Body Elections BC Reservations: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాని హామీ - అయినా మభ్యపెట్టేందుకు పార్టీలెందుకు ప్రయత్నిస్తాయి?
Kaju Katli Recipe : కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
కాజు కట్లీ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే సింపుల్‌గా ఇలా తయారు చేసుకోండి, రెసిపీ ఇదే
TGERC True Up Charges: వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
వచ్చే నెల నుంచి భారీగా పెరగనున్న కరెంట్ బిల్లులు.. ట్రూ అప్ ఛార్జీల వసూళ్లకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
Embed widget