Taapsee Pannu: కళ్ళ ముందే తిరిగినా పట్టించుకోలేదు... సీక్రెట్ వెడ్డింగ్ గురించి స్పందించిన తాప్సీ
Taapsee Pannu: 'ఐడియా ఆఫ్ ఇండియా 2025' సమ్మిట్ లో తాప్సీ పన్ను తన సీక్రెట్ మ్యారేజ్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా తమ రిలేషన్షిప్ గురించి ఎప్పుడూ దాచలేదని చెప్పింది.

హీరోయిన్ తాప్సీ పన్ను (Taapsee Pannu) డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బో (Mathias Boe)ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2024 మార్చి 23న ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే... తాప్సీ తన పెళ్లికి సంబంధించిన విషయాన్ని ముందుగా అనౌన్స్ చేయకుండా, డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి తన సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడింది తాప్సీ పన్ను.
అప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు
'ఐడియా ఆఫ్ ఇండియా 2025' సమ్మిట్ లో తాప్సీ పన్ను గెస్ట్ గా పాల్గొంది. ఈ సందర్భంగా తన సీక్రెట్ వెడ్డింగ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది ఈ బ్యూటీ. తను ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్న వ్యక్తితో, గత పదేళ్లుగా ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. ఎప్పుడూ ఏమీ దాచలేదని, కానీ ఆ టైంలో తనను మీడియా పట్టించుకోలేదని తాప్సి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ విషయమై తాప్సి మాట్లాడుతూ "నేను పెళ్లి చేసుకుని దాదాపు ఏడాది పూర్తవుతుంది. అంతకు ముందు 10 ఏళ్ల పాటు అతనితోనే ఉన్నాను. నేను ఏదీ దాచలేదు. మీడియా కంట చాలా సార్లు పడ్డాము. అప్పుడు ఎవ్వరూ మా ఇద్దరినీ పట్టించుకోలేదు. కాబట్టి నేను కూడా మా పర్సనల్ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదు అని సర్ది చెప్పుకున్నాను. అందుకే పెళ్లి విషయం గురించి కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఇక మా ప్రేమ ఎలా మొదలైంది అనే విషయాన్ని నేను చెప్పను. ఒకవేళ మీడియాకు అంత ఆసక్తిగా ఉంటే ఆ లవ్ ఎపిసోడ్ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి'' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే తాప్సి - మథియాస్ ప్రేమైపైన ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా తాప్సీనే అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్టిగేట్ చేసుకోండి అని హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
2024లో కాదు 2023లోనే పెళ్లి
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సి తన పెళ్లి 2024లో కాదు 23లోనే జరిగిందని చెప్పి మరో సర్ప్రైజ్ ఇచ్చింది. "2023 డిసెంబర్లోనే మా పెళ్లి జరిగింది. ఇరువురు పెద్దల సమక్షంలో మేము అప్పుడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ విషయం గురించి బయట పెట్టకపోతే అసలు ఎవ్వరికీ తెలీదు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలకు సంబంధించి సరైన బాలన్స్ ఉండాలని, పర్సనల్ విషయాలు ప్రొఫెషనల్ లైఫ్ కి ఆటంకంగా మారకూడదని అనుకున్నాము. అందుకే మేము వ్యక్తిగత విషయాలు పెద్దగా బయటకు చెప్పము. డిసెంబర్ లో మరోసారి సాంప్రదాయబద్ధంగా ఆత్మీయులు, సన్నిహితుల కోసం పెళ్లి చేసుకున్నాము. అందుకే ఈ వేడుకకు అతి కొద్దిమంది ఆత్మీయులను మాత్రమే ఇన్వైట్ చేశాము. అయితే పెళ్లి గురించి బహిరంగంగా దీని గురించి అనౌన్స్ చేయకపోవడం వల్ల మా పెళ్లిని అందరూ సీక్రెట్ మ్యారేజ్ అనుకున్నారు" అని క్లారిటీ ఇచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

