KKR vs SRH Match Highlights IPL 2025 | 80 పరుగుల తేడాతో SRH ను ఓడించిన KKR | ABP Desam
హుమ్ ఏం చెప్తాం..కాటేరమ్మ కొడుకులు ఈ సీజన్ లో 300 కొట్టేస్తారేమో కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే..మన ఆరెంజ్ ఆర్మీ బ్యాచ్ వెళ్లిన చోటుకల్లా కుమ్మించుకుని వస్తున్నారు. 300మంది దేవుడెరుగు కనీసం పోరాడి కూడా ఓడిపోవటం లేదు. ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో ముందు కోల్ కతా బ్యాటింగ్ తో SRH ను ఓ ఆట ఆడుకుని తర్వాత బౌలింగ్ తో అంత కంటే పెద్దాట ఆడింది. ఏకంగా 80 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కోలకతా నైట్ రైడర్స్ విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం..
1. కెప్టెన్ రహానే క్యామియో
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ డికాక్ ను నరైన్ త్వరగానే అవుట్ చేసిసి భలే డెసిషన్ తీసుకున్నాం భయ్యా అని సంబరపడిపోయే లోపు చిన్న కుర్రాడు ఆంగ్ క్రిష్ రఘవంశీతో కలిసి ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ ను ఫుట్ బాల్ ఆడుకున్నాడు కెప్టెన్ అజింక్యా రహానే. స్టార్టింగ్ ఇదేంటీ టెస్టు ఆడుతున్నాడు అనిపించినా మెల్లగా గేర్లు మార్చేశాడు. సిక్సర్లతో దుమ్ము రేపాడు. మొత్తంగా 27 బాల్స్ తో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 38 పరుగులు చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడి జీషన్ అన్సారీ బౌలింగ్ లో అవుటైపోయాడు రహానే
2. రఫ్పాడించిన రఘువంశీ
ముందు రహానే తో కలిసి తర్వాత వెంకటేశ్ అయ్యర్ తో కలిసిన ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఆటాడుకున్నాడు టీనేజర్ ఆంగ్ క్రిష్ రఘువంశీ. 32 బాల్స్ లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 50 పరుగులు చేసి కామిందు మెడిస్ బౌలింగ్ లో అవుటైపోయాడు. రఘవంశీ కెరీర్ లో ఇది రెండో హాఫ్ సెంచరీ. రెండు కేకేఆర్ తరపునే కొట్టాడు.
3. అయ్యారే అయ్యర్
మనోడు ఫామ్ లో ఉంటే నేనొక్కడినే చాలు అన్నట్లుంటుంది బ్యాటింగ్. రఘవంశీతో కలిసి మెల్లగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి చివరకొచ్చేసరికి ఎక్స్ ప్లోజివ్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బాల్స్ లోనే 7ఫోర్లు 3 సిక్సర్లతో 60పరుగులు చేశాడు వెంకేటశ్ అయ్యర్. చివర్లో చాన్నాళ్ల రింకూ సింగ్ కూడా టచ్ లోకి వచ్చినట్లు కనిపించి 17 బంతుల్లోనే 32 పరుగులు చేయటంతో కోల్ కతా నైట్ రైడర్స్ 200పరుగుల మార్క్ ను టచ్ చేసి SRH కి 201 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
4. వణికించిన వైభవ్ అరోరా
201 పరుగుల టార్గెట్ అయినా సరే ఆపోజిట్ లో ఉన్నది ఎవరు. కాటేరమ్మ కొడుకులు 300 కొట్టేసే సత్తా ఉన్నోళ్లు 201 అంటే డెడ్ ఈజీగా కొట్టేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ను బ్రేక్ చేశాడు వైభవ్ అరోరా. తోప్ తురుం బ్యాటర్లైన ట్రావియెస్ హెడ్, ఇషాన్ కిషన్ సహా హెన్రిచ్ క్లాసెన్ ల వికెట్లు తీశాడు వైభవ్ అరోరా. 4 ఓవర్లలో టీ2౦ లో అరుదుగా చూసే మెయిడిన్ ఓవర్ వేసి 29పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన అరోరా SRH ను ఏ దశలోనూ టార్గెట్ దిశగా సాగనివ్వలేదు.
5. తోక పని పట్టిన చక్రవర్తి, రస్సెల్
పేరుకే లోయర్ మిడిల్ ఆర్డర్ లో వస్తారు కానీ మ్యాచ్ స్వరూపం మార్చేయగల సత్తా ఉన్న అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ లను అవుట్ చేశాడు వరుణ్ చక్రవర్తి. సిమర్జిత్ వికెట్ కూడా తీసి మొత్తం మూడు వికెట్లు ఖాతాలో వేసుకుని SRH పని పట్టాడు. రస్సెల్ ప్రమాదకరమైన నితీశ్ కుమార్ రెడ్డితో పాటు చివర్లో హర్షల్ పటేల్ ను అవుట్ చేయటంతో SRH 120 పరుగులకే ఆలౌట్ అయ్యి కోల్ కతా కు 80పరుగుల భారీ విక్టరీని అందించాడు.



















