Kerala Cricket Team:హెల్మెట్‌కు తాకిన బంతి, 74 ఏళ్ల చరిత్రను మార్చేసిన కేరళ క్రికెట్ జట్టు!
Ranji Trophy 2025-25: రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా కేరళ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వివాదాస్పద అవుట్‌తో ఈ ఘనత సాధించింది.

Kerala vs Gujarat Ranji Trophy 2024-25: కేరళ క్రికెట్ జట్టు 2024-25 రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించింది. కేరళ రంజీ ఫైనల్‌లోకి ప్రవేశించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో విదర్భతో తలపడనుంది ఆ జట్టు. సెమీ-ఫైనల్స్‌లో కేరళ గుజరాత్‌తో హోరాహోరీగా తలపడి డ్రా చేసుకుంది. కానీ మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం ఉన్నందున కేరళను ఫైనల్‌కు పంపించారు.
గుజరాత్ చివరి వికెట్ విషయంలో భారీ వివాదం చెలరేగింది. దీంతో ఈ మ్యాచ్ హాట్ టాపిక్ అయింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేరళ 457 పరుగులు చేసింది. కేరళ తరఫున మహ్మద్ అజారుద్దీన్ 177 పరుగులతో అజేయంగా నిలిచాడు. 458 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 455 పరుగులు చేసింది. అప్పుడు మూడు పరుగులు చేస్తే గుజరాత్ గెలుస్తుంది ఒక వికెట్ తీస్తే కేరళ విజయం సాధిస్తుంది.
ఇక్కడ రంజీ ట్రోఫీలో మ్యాచ్ డ్రా అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టు గెలుస్తుంది. గుజరాత్ కేరళపై కనీసం ఒక పరుగు ఆధిక్యం పొందేలా చూసుకోవాలి. కానీ గుజరాత్ స్కోరు 455/9గా ఉన్నప్పుడు నాగవాస్వాలా క్రీజులో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను షాట్ కొట్టాడు. బంతి 'సిల్లీ మిడ్-ఆన్'లో ఉన్న ఫీల్డర్ హెల్మెట్‌ను తాకి పైకి లేచింది. గాల్లో ఉన్న బంతిని మరోవైపు ఉన్న సచిన్ బేబీ క్యాచ్ పట్టాడు.
The historic moment when the “one-run-victory” specialists, Kerala, assured their entry into the #RanjiTrophy final! pic.twitter.com/7uS5nWL1Or
— Shashi Tharoor (@ShashiTharoor) February 21, 2025
బంతి గాల్లో ల్యాండ్ కాలేదు కాబట్టి కేరళ ఆటగాళ్లు క్యాచ్ అవుట్ కోసం గట్టిగా అప్పీల్ చేశారు. నాగ్‌వాస్వాలా అవుట్ అయినట్టు అంపైర్ కూడా ప్రకటించేశాడు. దీంతో గుజరాత్ 455 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో కేరళకు తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యం ఆధారంగా, కేరళ ఫైనల్‌లోకి ప్రవేశించగలిగింది.
ఐసిసి రూల్స్ ఏంటీ ?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2017 సంవత్సరంలో ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం బంతి ఫీల్డర్ హెల్మెట్‌ను తాకి క్యాచ్ పట్టినా రన్ అవుట్ చేసినా అది అవుట్‌గాని చూస్తారు.
Scene : Gujarat need 2 runs, Kerala need 1 wicket to qualify for the finals
— Jaydev Unadkat (@JUnadkat) February 21, 2025
Yes that is destiny surely, Jalaj showing the helmet which helped them qualify, but what you don’t see is the courage that the short-leg fielder Salman Nizar has shown throughout the innings. This is… pic.twitter.com/RLRGTIoDjd
ఈ రూల్ ప్రకారం కేరళ జట్టు 74 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకుంది. కేరళ క్రికెట్ జట్టు 1950 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జట్టు రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకోలేదు. ఇప్పుడు తొలిసారి ఫైనల్‌లో ఆడబోతోంది.
Also Read: గిల్ సెంచరీతో హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
കളിയും, ജീവനും സേവ് ചെയ്യും ഹെൽമറ്റ്🤪
— Kerala Police (@TheKeralaPolice) February 21, 2025
ഫീൽഡിലായാലും റോഡിലായാലും
ഹെൽമറ്റ് നിർബന്ധം🙏🏻#keralapolice #trafficpolicekerala pic.twitter.com/GZeNPILC0x




















